నేపాల్‌లో భూప్రకంపనలు.. ఉత్తరభారతం, ఈశాన్య రాష్ట్రాలపై ఎఫెక్ట్
ABN , Publish Date - Nov 24 , 2026 | 09:27 AM
నేపాల్‌లోని కోషీ ప్రావిన్స్‌లో తాజాగా భూకంపం సంభవించింది. దీంతో, భారత్‌తో పాటు భూటాన్, బంగ్లాదేశ్, చైనాల్లో కూడా పలు చోట్ల భూప్రకంపనలు సంభవించాయి.
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‌లోని కోషీ ప్రావిన్స్‌లో తాజాగా భూకంపం సంభవించింది. దీంతో, భారత్‌తో పాటు భూటాన్, బంగ్లాదేశ్, చైనాల్లో కూడా పలు చోట్ల భూప్రకంపనలు సంభవించాయి. లెలెప్ ప్రాంతంలో ఉదయం 7.02 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. భూఉపరితలానికి 20 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉందని కూడా యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఈ నేపథ్యంలో నేపాల్ జాతీయ భూకంప పరిశోధన సంస్థ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైనట్టు తెలిపింది. టిబెట్‌తో సరిహద్దుకు సమీపంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొంది.
నేపాల్ భకంపం నేపథ్యంలో ఉత్తర భారతం, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భూప్రకంపనలు కనిపించాయి. బిహార్, మేఘాలయ, పశ్చిమబెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లోని భూమి స్వల్పంగా కంపించింది. ఏం జరుగుతోందో అర్థం కాక జనాలు ఆందోళనకు గురయ్యారు. ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఇళ్లు, భవనాలేవీ దెబ్బతినలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, నేడు తెల్లవారుజామున 3.39 సమయంలో అస్సాంలోని కార్బీఆంగ్లాంగ్ జిల్లాలో కూడా రిక్టర్ స్కేలుపై 2.5 స్వల్ప త్రీవతతో భూకంపం సంభవించింది.
ఈ వార్తలనూ చదవండి:
గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేసి రాత్రంతా శవం పక్కనే
‘త్రిష పేరవై’పేరుతో సేవా సంఘం ప్రారంభం