Share News

‘త్రిష పేరవై’పేరుతో సేవా సంఘం ప్రారంభం

ABN , Publish Date - Nov 24 , 2026 | 01:53 AM

ప్రముఖ సినీనటి త్రిష పేరుతో సేవా సంస్థ ప్రారంభమైంది.

‘త్రిష పేరవై’పేరుతో సేవా సంఘం ప్రారంభం
trisha

చెన్నై, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీనటి త్రిష పేరుతో సేవా సంస్థ ప్రారంభమైంది. తిరునల్వేలిలో ‘ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై’ (యువ విప్లవ నాయకి త్రిష సేవా సంస్థ) పేరుతో ఆ సంస్థ ఏర్పాటటైంది. ఈ సంఘం వ్యవస్థాపకుడిగా ప్రకటించుకున్న రాజగోపాల్‌ సంఘం లోగోను ఆవిష్కరించి, నూతన నిర్వాహకులను మీడియాకు పరిచయం చేశారు. లోగోలో ‘పదవుల కోసం కాదు! తమిళ ప్రజల హక్కుల కోసం!’ అనే నినాదం ఉంది. ఈ సందర్భంగా రాజగోపాల్‌ విలేకరులతో మాట్లాడుతూ..‘మాజీ ముఖ్యమంత్రి జయలలిత పరిపాలనా దక్షురాలు...నటి త్రిష కూడా అంతటి సమర్థత కలిగినవారే. త్రిష వ్యక్తిత్వం కూడా జయ వ్యక్తిత్వం లాంటిదే. రాజకీయాల్లోకి వస్తే రాష్ట్ర ప్రజల కోసం మంచి పథకాలు, ప్రణాళికలు అమలు చేయగలరు. త్రిషను మేము జయలలిత వారసురాలిగానే పరిగణిస్తాం. అందుకే ‘ఇళయపురట్చి తలైవి త్రిష పేరవై’ని ప్రారంభించాం. ఈ పేరవై ద్వారా విరివిగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టనున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా సంఘం చర్యలు చేపడుతుంది’ అని వివరించారు.

ఇవి కూడా చదవండి..

దేశవ్యాప్తంగా త్వరలో అనర్హుల రేషన్ కార్డుల ఏరివేత.. కేంద్రం రంగం సిద్ధం

కేబీసీపై వైరల్ వీడియో ఫేక్.. అమితాబ్ అసలు ఆ ప్రశ్నే అడగలేదట

Updated Date - Nov 24 , 2026 | 03:30 AM