Share News

దేశవ్యాప్తంగా త్వరలో అనర్హుల రేషన్ కార్డుల ఏరివేత.. కేంద్రం రంగం సిద్ధం

ABN , Publish Date - Nov 23 , 2026 | 01:50 PM

దేశవ్యాప్తంగా అనర్హుల రేషన్ కార్డుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన (పీఎంజీకేఏవై) లో భారీగా అనర్హులు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. కారు, ఏసీ, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారు కూడా ఉచిత రేషన్ ద్వారా లబ్ధి పొందుతున్నట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధ్యయనంలో తేలింది.

దేశవ్యాప్తంగా త్వరలో అనర్హుల రేషన్ కార్డుల ఏరివేత.. కేంద్రం రంగం సిద్ధం

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా అనర్హుల రేషన్ కార్డుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన (పీఎంజీకేఏవై) లో భారీగా అనర్హులు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. కారు, ఏసీ, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారు కూడా ఉచిత రేషన్ ద్వారా లబ్ధి పొందుతున్నట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధ్యయనంలో తేలింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 51,303 లబ్ధిదారుల కుటుంబాలపై కేంద్రం సమగ్ర సర్వే నిర్వహించింది. పట్టణ ప్రాంతాల్లోని ప్రాధాన్యతా కుటుంబాల్లో 15.7 శాతం మంది అనర్హులు ఉన్నట్లు బయటపడింది. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 39.5 శాతం అనర్హులు, త్రిపురలో 39.2 శాతం, తమిళనాడులో 38.7 శాతం, మేఘాలయలో 28.5 శాతం మంది అనర్హులు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే దేశవ్యాప్తంగా అనర్హుల రేషన్ కార్డుల ఏరివేతకు రంగం సిద్ధం చేసింది.


ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన కింద ఉచిత రేషన్ పంపిణీలో 13.2 శాతం మేర అనర్హులు ఉన్నట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. జాతీయ సగటు 13.2 శాతం కాగా, పట్టణ ప్రాంతాల్లోని ప్రాధాన్యతా కుటుంబాల్లో అనర్హులు 15.7 శాతం వరకు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. సంపన్న వర్గాలు కూడా రేషన్ కార్డులను కలిగి ఉండటం వల్ల ఖజానాపై రూ.వేల కోట్ల భారం పడటంతో పాటు నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు ఒక నివేదిక సమర్పించారు. ఈ నివేదిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ కేవైసీ పూర్తి చేసి, అనర్హుల రేషన్ కార్డులను తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

జపాన్‌లో బద్దలైన అగ్నిపర్వతం.. షాకింగ్ వీడియో వైరల్

వాంతి చేసుకునే ప్రయత్నంలో ఫోర్క్ మింగిన మహిళ.. చివరకు..

Updated Date - Nov 23 , 2026 | 02:12 PM