Share News

ఆసియా పవర్ ఇండెక్స్ 2026లో భారత్‌కు మూడో స్థానం.. మోదీకి రెండో ర్యాంక్

ABN , Publish Date - Nov 23 , 2026 | 12:28 PM

2026 ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్ మూడో అత్యంత శక్తిమంతమైన దేశంగా అవతరించి.. తన స్థానాన్ని పటిష్ట పరుచుకుందని ఆస్ట్రేలియాలోని లోవీ ఇనిస్టిట్యూట్ నివేదిక వెల్లడించింది. సోమవారం ఆ సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది.

ఆసియా పవర్ ఇండెక్స్ 2026లో భారత్‌కు మూడో స్థానం.. మోదీకి రెండో ర్యాంక్
PM Modi

న్యూఢిల్లీ, నవంబర్ 23: 2026 ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్ మూడో అత్యంత శక్తిమంతమైన దేశంగా అవతరించి.. తన స్థానాన్ని పటిష్ట పరుచుకుందని ఆస్ట్రేలియాలోని లోవీ ఇనిస్టిట్యూట్ నివేదిక వెల్లడించింది. సోమవారం ఆ సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. చైనా, అమెరికా తొలి రెండు స్థానాలను ఆక్రమించాయని తెలిపింది. దౌత్యపరమైన హోదా, రక్షణ రంగ భాగస్వామ్యం, సాంస్కృతిక విస్తరణ వల్ల భారత్‌కు ఈ స్థానం సాధ్యమైందని సోదాహరణగా వివరించింది. ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన ప్రాంతీయ నాయకుడుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండో స్థానంలో నిలిచారని పేర్కొంది. తొలి స్థానాన్ని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆక్రమించారని చెప్పింది.


భారత్ మొత్తం పవర్ స్కోరు 40.5 పాయింట్లు పెరిగిందని ఈ నివేదిక తెలిపింది. దీంతో భారత్, చైనాల మధ్య అంతరం బాగా తగ్గిందని అంది. కానీ భారత్ కంటే చైనా పవర్ సుమారు 80 శాతం అధికంగా ఉందని పేర్కొంది. 70.3 పాయింట్ల స్కోరుతో దౌత్యపరంగా భారత్ అత్యంత బలమైన రంగంగా నిలిచిందని వివరించింది. ఇక భవిష్యత్ వనరుల స్కోరు 56.2 పాయింట్లతో మెరుగుపడిందని.. దేశ ఆర్థిక సామర్థ్య స్కోరు 26.4 పాయింట్లుగా ఉందని సదరు నివేదికలో పేర్కొంది.


భారత్ 40.6 పాయింట్లతో పైస్థానానికి ఎగబాకి ఒక ప్రధాన శక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని లోవీ ఇన్‌స్టిట్యూట్‌లోని ఆగ్నేయాసియా ప్రోగ్రామ్ డైరెక్టర్ హంటర్ మార్స్టన్ వెల్లడించారు. 2018 తర్వాత చైనాతో ఉన్న అంతరం ఇంత తక్కువగా ఉందని తెలిపారు. భారతదేశం ఆర్థికంగా తగ్గుదల ఉన్నప్పటికీ రెండో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా మోదీ రెండో స్థానంలో నిలచారని తన ఎక్స్ ఖాతా ద్వారా హంటర్ మార్స్టన్ వివరించారు.


ఈ ఆసియా పవర్ ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలో ఉండటానికి గల కరణాలతో కూడిన అంశాలను ఈ నివేదికలో సోదాహరణంగా వివరించింది. ఆసియా పవర్ ఇండెక్స్ 27 దేశాలు.. వాటి భూభాగాలను మదింపు చేస్తుంది. అందులో శక్తి, ఆర్థిక, సైనిక సామర్థ్యం, దౌత్య ప్రభావం, ఆర్థిక సంబంధాలు తదితర మొత్తం ఎనిమిది అంశాలను కొలమానంగా తీసుకుంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీట్ల పంపకాలపై కాంగ్రెస్, ఎస్పీ మధ్య సమావేశం

గూడ్స్ రైలు పైకెక్కి బాలుడి రీల్స్.. విద్యుదాఘాతంతో దుర్మరణం

Updated Date - Nov 23 , 2026 | 12:37 PM