Share News

గూడ్స్ రైలు పైకెక్కి బాలుడి రీల్స్.. విద్యుదాఘాతంతో దుర్మరణం

ABN , Publish Date - Nov 23 , 2026 | 09:33 AM

హర్యానాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గూడ్స్ రైలు ఎక్కి రీల్స్ రికార్డు చేయబోయిన ఓ 10వ తరగతి బాలుడు విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందాడు.

గూడ్స్ రైలు పైకెక్కి బాలుడి రీల్స్.. విద్యుదాఘాతంతో దుర్మరణం
Haryana student death

ఇంటర్నెట్ డెస్క్: హర్యానాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గూడ్స్ రైలు ఎక్కి రీల్స్ రికార్డు చేయబోయిన ఓ 10వ తరగతి బాలుడు విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందాడు. యమునానగర్‌లోని జగధ్రీ రైల్వే వర్క్ షాప్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని జవహర్‌నగర్‌కు చెందిన కేశవ్‌గా గుర్తించారు.


జాతీయ మీడియా కథనాల ప్రకారం, 10వ తరగతి చదువుతున్న కేశవ్ తన బంధువు ఆశిష్‌తో కలిసి ఇటీవల బయటకు వెళ్లాడు. ఓ షాపులో కొత్తదుస్తులు కొనుక్కున్నాడు. ఆ తరువాత వస్తుండగా వారికి రైల్వే వర్క్ షాపు వద్ద నిలిపి ఉంచిన గూడ్స్ రైలు కనిపించింది. ఈ క్రమంలో కేశవ్ ఆ రైలు ఎక్కి రీల్స్ రికార్డు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అతడి చేయి పైనున్న హైటెన్షన్ విద్యుత్ తీగకు తగలడంతో భారీ ప్రమాదం జరిగింది. విద్యుత్ షాక్‌ తగిలి ఒళ్లంతా కాలిపోవడంతో అతడు మరణించాడు. ఆ తరువాత అక్కడకు వచ్చిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలుడికి ఓ సోదరి ఉంది. అతడి తండ్రి ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తుంటారని పోలీసులు తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి:

‘సరయూ-కమల ఎక్స్‌ప్రెస్’కు మోదీ, నేపాల్ ప్రధాని పచ్చజెండా

కార్తీకదీపంపై సుప్రీంకోర్టులో విజయ్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్

Updated Date - Nov 23 , 2026 | 09:33 AM