Share News

సీట్ల పంపకాలపై కాంగ్రెస్, ఎస్పీ మధ్య సమావేశం

ABN , Publish Date - Nov 23 , 2026 | 11:39 AM

ఉత్తర ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీట్ల పంపకాలపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేతల మధ్య మరికాసేపట్లో భేటీ జరగనుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం జరగనుంది.

సీట్ల పంపకాలపై కాంగ్రెస్, ఎస్పీ మధ్య సమావేశం

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీట్ల పంపకాలపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేతల మధ్య మరికాసేపట్లో భేటీ జరగనుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం జరగనుంది. రెండు రోజుల పాటు ఈ భేటీ కొనసాగనుంది. సీట్ల పంపకాలపై నేతలు చర్చించనున్నారు. రెండు పార్టీల నుంచి నలుగురు చొప్పున నేతలు ఇందులో పాల్గొననున్నారు. కాంగ్రెస్ నుంచి యూపీ ఇన్‌చార్జి రాజేంద్ర పాల్ గౌతమ్, యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరాధనా మిశ్రా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్, శాసనసభా పక్ష నేత వీరేంద్ర చౌధరి పాల్గొననున్నారు. అలాగే ఎస్పీ నుంచి ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రాంగోపాల్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్‌లాల్ పాల్, ఎంపీలు రాజీవ్ రాయ్, ఇర్కా హసన్ పాల్గొననున్నారు. అయితే, కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక వాద్రా గాంధీ ఈ సమావేశంలో పాల్గొనకపోయినా.. తెర వెనుక నుంచి ఆమె వ్యవహారాలను నడిపించనున్నారు.


100 సీట్లపైనే కాంగ్రెస్ డిమాండ్!

మొత్తం 403 సీట్లు ఉన్న యూపీ అసెంబ్లీలో కాంగ్రెస్ 100 సీట్లకుపైనే డిమాండ్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వాటిలో 60 బలమైన సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీ బలంగా ఉన్నచోట 40-45 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఎస్పీని కాంగ్రెస్‌ అడిగే చాన్స్ ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో త్రుటిలో ఓడిపోయిన అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టనుంది. కాగా.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. అప్పుడు 105 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేసింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా 100కు పైనే స్థానాల్లో పోటీచేయాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 80 సీట్లకుగాను 17 చోట్ల హస్తం పార్టీ పోటీ చేసింది. ఈ ఫార్ములా (17*5) ను దృష్టిలో ఉంచుకొని కనీసం 85పైనే సీట్లను కాంగ్రెస్ కోరుకుంటోంది.


ఈ వార్తలనూ చదవండి:

జపాన్‌లో బద్దలైన అగ్నిపర్వతం.. షాకింగ్ వీడియో వైరల్

వాంతి చేసుకునే ప్రయత్నంలో ఫోర్క్ మింగిన మహిళ.. చివరకు..

Updated Date - Nov 23 , 2026 | 11:39 AM