వాంతి చేసుకునే ప్రయత్నంలో కఫోర్క్ మింగిన మహిళ.. చివరకు..
ABN , Publish Date - Nov 22 , 2026 | 01:53 PM
వాంతి చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఓ యువతి అనుకోకుండా ఫోర్క్‌ను మింగింది. ఈ ఘటన న్యూజిలాండ్‌లో జరిగింది. కడుపులోకి చేరిన ఫోర్క్‌ను వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు.
ఇంటర్నెట్ డెస్క్: వాంతి చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఓ యువతి అనుకోకుండా ఫోర్క్‌ను మింగింది. ఈ ఘటన న్యూజిలాండ్‌లో జరిగింది. కడుపులోకి చేరిన ఫోర్క్‌ను వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. న్యూజిలాండ్‌లోని వైకాటో ఆసుపత్రికి 27 ఏళ్ల యువతి వెళ్లింది. తాను ఫోర్క్ మింగానని తెలిపింది. ఎక్స్‌రే నిర్వహించిన డాక్టర్లు.. ఆమె కడుపులో ఫోర్క్ ఉన్నట్లు గుర్తించారు. తొలుత ఎండోస్కోపీ ద్వారా నోటి నుంచి దానిని బయటకు తీసేందుకు రెండుసార్లు ప్రయత్నించారు. కానీ సఫలం కాలేదు. దీంతో ల్యాప్రోస్కోపిక్ (కీహోల్) శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. కడుపుకు సుమారు 4 సెంటీమీటర్ల మేర కోత పెట్టి ఫోర్క్‌ను బయటకు తీశారు. అనంతరం కడుపులో ఏర్పడిన రంధ్రాన్ని మూసివేశారు. అదృష్టవశాత్తూ ఫోర్క్ కారణంగా ఆమె కడుపులో ఎలాంటి చిల్లులు పడలేదని, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా లేవని శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ జెస్సీ ఫిషర్ వెల్లడించారు.
ఈ ఘటనపై డాక్టర్ ఫిషర్ మాట్లాడుతూ.. యువతి ఫోర్క్‌ను ఎందుకు ఉపయోగించిందో స్పష్టంగా తెలియలేదన్నారు. ఏదో సందర్భంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం ఉందని, అయితే ఆమె వాంతి చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందో తెలియదని పేర్కొన్నారు. గతంలో ఆమెకు ఆహారపు అలవాట్లకు సంబంధించిన రుగ్మతలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు లేదని తెలిపారు. ఫోర్క్ కడుపులోకి చేరడమే ఆశ్చర్యకరమైన విషయమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, శస్త్రచికిత్స అనంతరం యువతి ఎలాంటి సమస్యలు లేకుండా కోలుకుంది. రెండు రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయింది.
ఈ వార్తలనూ చదవండి:
డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక
భారత్ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక