ఫిర్యాదు చేయాలా? అన్న ప్యాసింజెర్.. టీటీఈ సమాధానానికి షాక్
ABN , Publish Date - Nov 21 , 2026 | 11:15 PM
ఇటీవల రైల్లో తన కొత్త షూస్ పోగొట్టుకున్న ప్రయాణికుడు టీటీఈ ఇచ్చిన సమాధానానికి మరింత షాకయ్యాడు. ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్గా మారింది.
ఇంటర్నెట్ గెస్క్: ఇటీవల రైల్లో తన కొత్త షూస్ పోగొట్టుకున్న ప్రయాణికుడు టీటీఈ ఇచ్చిన సమాధానానికి మరింత షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఆ ప్రయాణికుడే స్వయంగా నెట్టింట ఈ ఉదంతాన్ని షేర్ చేశాడు.
రైల్లో వెళుతుండగా తన కొత్త నైకీ బూట్లు పోయాయని ఆ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు పైబెర్తు వచ్చిందని చెప్పాడు. రాత్రి వేళ నిద్రించే సమయంలో తన కొత్త నైకీ బూట్లను కాళ్ల దగ్గర పెట్టుకున్నానని అన్నాడు. తెల్లారి లేచి చూస్తే అవి కనిపించలేదని చెప్పాడు. దాని స్థానంలో వేరే బూట్లు కనిపించడంతో షాకైపోయినట్టు చెప్పాడు. మొదట తాను ఏం చూస్తున్నదీ అర్థం కాలేదని, సగం నిద్రలో ఉన్నానేమో అని అనిపించిందని కూడా వ్యాఖ్యానించాడు.
ఈ విషయంలో ఎవరికైనా ఫిర్యాదు చేయాలా? అని టీటీఈని ప్రశ్నించానని అతడు చెప్పాడు. అయితే, తన బూట్లు కూడా రెండు నెలల క్రితం పోయాయని టీటీఈ చెప్పడంతో తాను షాకయ్యానని అన్నాడు.ఈ పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కొత్త బూట్లతో రైళ్లల్లో ప్రయాణించకపోవడమే మంచిదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ విషయం మర్చిపోవాలని మరికొందరు సలహా ఇచ్చారు.
ఈ వార్తలనూ చదవండి:
కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి
సముద్రపు గడ్డి అనుకుంటే పొరపాటే.. తలకిందులుగా ఈదే వింత చేప