Share News

సముద్రపు గడ్డి అనుకుంటే పొరపాటే.. తలకిందులుగా ఈదే వింత చేప

ABN , Publish Date - Nov 21 , 2026 | 04:17 PM

సముద్రపు గడ్డి అనుకుంటున్నారా..? అయితే మీరు పొరబడినట్లే! సముద్రపు అడుగున గడ్డి మొక్కల్లా కనిపిస్తున్న ఈ జీవులు నిజానికి అరుదైన రకం చేపలు. తల కిందకు, తోక పైకి పెట్టి తలకిందులుగా ఈదుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

సముద్రపు గడ్డి అనుకుంటే పొరపాటే.. తలకిందులుగా ఈదే వింత చేప
Razorfish

ఇంటర్నెట్ డెస్క్: సముద్రపు అడుగుభాగంలో సముద్రపు గడ్డి ఊగుతున్నట్లుగా కనిపిస్తోందా? అయితే మీరు పొరబడినట్లే! అవి మొక్కలు కాదు.. తల కిందకు, తోక పైకి పెట్టి నిలువుగా ఈదే అరుదైన రకం చేపలు. వీటినే గాడిగల రేజర్‌ఫిష్‌లు (Razorfish) అంటారు. సముద్రపు గడ్డి, పగడాల మధ్య సులభంగా కలిసిపోయేలా ఉండే వీటి ప్రత్యేకమైన శరీర నిర్మాణం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ చేపలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుంపులుగా ఒకే దిశలో కదులుతూ.. సముద్రపు మొక్కల్లా కనిపించే ఈ చేపల వినూత్న ఈత శైలి నెటిజన్లను ఆకట్టుకుంటోంది.


ఈ రేజర్‌ఫిష్‌ల శరీరం చాలా సన్నగా.. చదునుగా ఉంటుంది. శరీరంపై ఉండే నల్లటి చారలు, తల కిందకు పెట్టి ఈదే ప్రత్యేకమైన అలవాటు వీటికి సహజమైన రక్షణ కవచంలా పనిచేస్తాయి. సముద్రపు గడ్డి లేదా పగడపు కొమ్మల మధ్య దాక్కున్నప్పుడు పెద్ద చేపలు సైతం వీటిని గుర్తించడం కష్టమవుతుంది. అంతేకాదు.. వీటి వేటాడే పద్ధతి కూడా ఎంతో ప్రత్యేకం. నోటి ముందు ఉండే పొడవైన గొట్టం లాంటి ముట్టెతో చిన్న క్రస్టేషియన్‌లను వాక్యూమ్‌లా పీల్చుకుని ఆహారంగా తీసుకుంటాయి. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం.. వీటి ఆహారాన్ని పట్టుకునే చర్య కేవలం 4 మిల్లీసెకన్లలోనే పూర్తవుతుంది. అంటే మనిషి కనురెప్ప వేయడానికి పట్టే సమయం కంటే ఎంతో వేగంగా వేట సాగిస్తాయి. సముద్ర జీవుల్లో ప్రకృతి సృష్టించిన అద్భుతాలకు ఈ రేజర్‌ఫిష్‌లు మరో నిదర్శనంగా నిలుస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

రాహుల్‌ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్.. కాంగ్రెస్‌కు నాలుగు సూటి ప్రశ్నలు..

ఆసక్తికరంగా కొలత్తూరు ఉపఎన్నిక.. ఎంకే స్టాలిన్ మళ్లీ పోటీ చేస్తారా..?

Updated Date - Nov 21 , 2026 | 04:52 PM