Share News

కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి

ABN , Publish Date - Nov 21 , 2026 | 06:06 PM

కౌన్ బనేగా క్రోర్‌పతి సీజన్ 18తో వెటరన్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ మళ్లీ వచ్చారు. ఈ సీజన్‌లో మహారాష్ట్రకు చెందిన భూషణ్ ఠాక్రే రూ.కోటి గెలిచి మొదటి కోటీశ్వరుడు అయ్యారు. ఆ షోకు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు.

కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి

ఇంటర్నెట్ డెస్క్: కౌన్ బనేగా క్రోర్‌పతి సీజన్ 18తో వెటరన్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ మళ్లీ వచ్చారు. ఈ సీజన్‌లో మహారాష్ట్రకు చెందిన భూషణ్ ఠాక్రే రూ.కోటి గెలిచి మొదటి కోటీశ్వరుడు అయ్యారు. ఆ షోకు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. ఇదివరకే ఈ సీజన్‌లో చాలా మంది రూ.కోటి ప్రశ్న వరకు చేరుకోగలిగారు. అయితే, అందరూ అక్కడితోనే పోటీ నుంచి తప్పుకున్నారు. భూషణ్ కూడా రూ.50 లక్షలు గెలిచి రూ.కోటి ప్రశ్న వరకు వచ్చారు. 15వ ప్రశ్నకు ఆయన సరైన సమాధానం చెప్పడంతో సీజన్ 18లో మొదటి కోటీశ్వరుడిగా నిలిచారు. దాంతో షోలో కేరింతలు మొదలయ్యాయి. భూషణ్ కోటి గెలిచిన తర్వాత బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆయనను హగ్ చేసుకుని అభినందనలు తెలిపారు.


ఏడాదిన్నర కాలంగా ఇంటికి దూరం

ఈ షోలో అమితాబ్ బచ్చన్‌తో భూషణ్ ఠాక్రే మాట్లాడారు. తాను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నానని ఆయన తెలిపారు. ఇందు కోసం తాను ఏడాదిన్నర కాలంగా ఇంటికి దూరంగా ఉన్నానని చెప్పారు. ‘నా తండ్రి కూలి కార్మికుడిగా పనిచేసి నన్ను చదివించారు. ఇప్పుడు నేను రూ.కోటి గెలిచాను. ఈ విషయం తెలిస్తే నా తండ్రి ఎంతో సంతోషిస్తారు. ఆయన కళ్లలో ఆనందం చూడాలనుకుంటున్నా’ అని భూషణ్ పేర్కొన్నారు. కాగా.. అమితాబ్ 16వ ప్రశ్న అడగబోతుండగా క్లిప్ ముగుస్తుంది. ఇక అనారోగ్యం కారణంగా ఈ సీజన్ నుంచి అమితాబ్ కాస్త బ్రేక్ తీసుకున్నారు. ఈనెల 16న మళ్లీ తిరిగి రావడంతో కేబీసీ సీజన్ 18 పున:ప్రారంభమైంది. ఈ షో సోనీ లివ్, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది.


ఇవి కూడా చదవండి..

ప్రైవేటు వాహనాలపై కుల గుర్తులు, పేర్ల నిషేధం.. గుజరాత్ ప్రభుత్వం ఆదేశం

ఆర్మీ జవాన్‌కు చలాన్ విధించిన అధికారి.. విధుల నుంచి తొలగింపు

Updated Date - Nov 21 , 2026 | 06:06 PM