Share News

విడాకుల నిర్ణయాన్ని మార్చిన భర్త ప్రేమ.. కన్నీళ్లతో తిరిగొచ్చిన భార్య..

ABN , Publish Date - Nov 20 , 2026 | 06:02 PM

భార్యాభర్తల బంధంలో మనస్పర్థలు రావడం సహజం. అయితే.. కొన్ని సందర్భాల్లో అవే విభేదాలు విడాకుల వరకు దారితీస్తుంటాయి. కానీ ప్రేమ, ఆప్యాయతతో చేసిన ఒక్క విజ్ఞప్తి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాగలదని ఓ ఘటన నిరూపిస్తోంది.

విడాకుల నిర్ణయాన్ని మార్చిన భర్త ప్రేమ.. కన్నీళ్లతో తిరిగొచ్చిన భార్య..
Husband Wife Relationship

ఇంటర్నెట్ డెస్క్: భార్యాభర్తల బంధంలో మనస్పర్థలు రావడం సహజం. అయితే.. కొన్ని సందర్భాల్లో అవే విభేదాలు విడాకుల వరకు దారితీస్తుంటాయి. కానీ ప్రేమ, ఆప్యాయతతో చేసిన ఒక్క విజ్ఞప్తి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాగలదని ఓ ఘటన నిరూపిస్తోంది.

విడాకుల పత్రాలపై సంతకం చేసి తన భర్తతో ఉన్న బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్న ఓ మహిళ చివరి నిమిషంలో మనసు మార్చుకుంది. భార్య తనను విడిచి వెళ్లిపోవద్దని.. మరోసారి కలిసి జీవిద్దామని భర్త భావోద్వేగంతో వేడుకున్నాడు. అతడి మాటలు.. ప్రేమతో కూడిన విజ్ఞప్తి ఆమె మనసును కదిలించాయి. అప్పటివరకు విడాకులే కావాలని పట్టుబట్టిన ఆమె ఒక్కసారిగా తన నిర్ణయం గురించి మరోసారి ఆలోచించి గొప్ప నిర్ణయం తీసుకుంది.


భర్త విజ్ఞప్తితో మనసు మార్చుకున్న ఆ మహిళ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతడి దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లింది. భర్తను గట్టిగా కౌగిలించుకుని బోరున ఏడ్చింది. విడాకులు తీసుకుని విడిపోవాలని భావించిన ఆమె.. చివరకు భర్తతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా భావోద్వేగంగా మారిపోయింది. ఇన్నాళ్లూ తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి మరోసారి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఈ ఘటనలో కనిపిస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో కానీ.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి...

తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ.. ఉద్రిక్తం

పగిడ్యాల ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా.. కోరం లేక నిలిచిన ప్రక్రియ

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 20 , 2026 | 06:49 PM