పగిడ్యాల ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా.. కోరం లేక నిలిచిన ప్రక్రియ
ABN , Publish Date - Nov 20 , 2026 | 01:18 PM
నంద్యాల జిల్లాలోని పగిడ్యాల ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నిక నిర్వహించలేమని అధికారులు ప్రకటించారు.
నంద్యాల, నవంబర్ 20: జిల్లాలోని పగిడ్యాల మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నిక నిర్వహించలేమని అధికారులు ప్రకటించారు. తదుపరి ఎన్నిక తేదీని త్వరలో ప్రకటిస్తామని రిటర్నింగ్ అధికారి (ఆర్వో) నగేష్ వెల్లడించారు. శుక్రవారం ఎంపీపీ ఎన్నిక నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, అవసరమైన కోరం హాజరు కాకపోవడంతో ఎన్నిక ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జయసూర్య, ఎంపీ బైరెడ్డి శబరి వర్గీయుల మధ్య ఏకాభిప్రాయం కుదిర్చేందుకు టీడీపీ అబ్జర్వర్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, ఆ చర్చలు ఫలించలేదు.
ఇరువర్గాల నేతలు తమ పట్టు వీడకపోవడంతో సమస్య కొలిక్కి రాలేదు. చర్చల నేపథ్యంలో ఎంపీటీసీ సమావేశ మందిరం నుంచి వెనుదిరిగినట్లు తెలుస్తోంది. దీంతో కోరం లేకపోవడంతో అధికారులు ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన పగిడ్యాల ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా పడటంతో స్థానికంగా ఉత్కంఠ కొనసాగుతోంది. తదుపరి ఎన్నిక తేదీని అధికారులు ప్రకటించిన తర్వాతే ఎన్నిక ప్రక్రియపై స్పష్టత రానుంది.
ఇవి కూడా చదవండి...
షర్మిలపై అలాంటి రాతలేంటి? సిగ్గుండాలి: సోమిరెడ్డి చంద్రమోహన్
తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ.. ఉద్రిక్తం
Read Latest AP News And Telugu News