Share News

షర్మిలపై అలాంటి రాతలేంటి? సిగ్గుండాలి: సోమిరెడ్డి చంద్రమోహన్

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:31 PM

కుమార్తె పెళ్లికి పిలిచేందుకు సీఎం చంద్రబాబును వైఎస్ షర్మిల కలవడంపై సాక్షిలో వచ్చిన కథనంపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల తన వాటా ఆస్తి అడిగినందుకే.. ఆమె నాశనం కావాలని సాక్షి కోరుకుంటోందని వ్యాఖ్యానించారు.

షర్మిలపై అలాంటి రాతలేంటి? సిగ్గుండాలి: సోమిరెడ్డి చంద్రమోహన్
Somireddy Chandramohan Reddy

నెల్లూరు, నవంబర్ 20: కుమార్తె పెళ్లికి పిలిచేందుకు సీఎం చంద్రబాబును వైఎస్ షర్మిల కలవడంపై సాక్షిలో వచ్చిన కథనంపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల తన వాటా ఆస్తి అడిగినందుకే.. ఆమె నాశనం కావాలని సాక్షి కోరుకుంటోందని వ్యాఖ్యానించారు. ‘నేను, నా కుమారుడు పెళ్లికి పిలవడానికి వెళితే.. వైఎస్ అభిమానంగా పలుకరించారు. బిడ్డల పెళ్లిళ్లకి ఆహ్వానించడం తప్పా?’ అంటూ ప్రశ్నించారు. షర్మిలపై సాక్షిలో అలాంటి రాతలేమిటి?.. సిగ్గుండాలి అంటూ సోమిరెడ్డి ఫైర్ అయ్యారు.


మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపైనా సోమిరెడ్డి విరుచుకుపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉందని.. ఇరిగేషన్‌పై మాజీ మంత్రి కాకాణికి విషయ పరిజ్ఞానం లేదన్నారు. జిల్లా బాగుండకూడదని కాకాణి కోరుకుంటుంటే... ఏపీ నాశనం కావాలని జగన్ కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సోమశిలలో 33 టీఎంసీలు రెండవ పంటకి ఖర్చు చేశామని.. 4 లక్షల ఎకరాల్లో 16 లక్షల పుట్ల ధాన్యం దిగుబడులకు వచ్చాయన్నారు. రూ.4 వేల‌ కోట్ల మేర రైతులు అమ్మకాలు సాగించారని తెలిపారు.


సోమశిల, కండలేరు డ్యాంలు ఎన్టీఆర్ కృషి అని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. సర్వేపల్లి రిజర్వాయర్‌ను పటిష్ఠం చేస్తున్నామన్నారు. కాకాణికి, సాక్షి పత్రికకి కళ్లు కనిపించవా? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచేందుకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. నెల్లూరు జిల్లాలో తెలుగుగంగ... టీడీపీ సృష్టి అని అన్నారు. కాకాణికి ఒక టీఎంసీకి ఎన్ని ఎకరాలు పండుతుందో తెలియదని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ శాఖలో ఒక్క షెట్టర్ బిగించకుండా దొంగ బిల్లులు చేసుకున్నారని.. రూ.150 కోట్ల నిధులు మింగేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి...

జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థుల ఖరారు

పులివెందులలో ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 20 , 2026 | 12:43 PM