Share News

తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ.. ఉద్రిక్తం

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:55 PM

అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరువర్గాలూ పరస్పరం రాళ్ల దాడులకు పాల్పడ్డారు.

తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ.. ఉద్రిక్తం
Tadipatri Clashes

అనంతపురం, నవంబర్ 20: జిల్లాలోని తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరువర్గాలూ పరస్పరం రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మొదట మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంపై నుంచి కావాలనే టీడీపీ శ్రేణులను వైసీపీ వర్గం రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ వర్గీయులు జూనియర్ కాలేజీ వద్దకు చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో రాళ్ల దాడికి పాల్పడ్డారు.


తొలుత పెద్దారెడ్డి ఇంటిపై నుంచి వైసీపీ వర్గీయులు రాళ్లతో దాడులు చేశారు. దీంతో జూనియర్ కళాశాల మైదానం నుంచి టీడీపీ శ్రేణులు ఎదురు దాడులు చేశారు. ఇరువర్గాల మధ్య పరస్పరం రాళ్ల దాడులు జరగడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కేతిరెడ్డి నివాసంపై నుంచి రాళ్ల దాడి చేయడంతో టీడీపీకి చెందిన ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పెద్దఎత్తున పోలీసు బలగాలు అక్కడకు చేరుకుని టీడీపీ, వైసీపీ వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో తాడిపత్రిలోని ప్రధాన కూడళ్లలో స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు.


ఇవి కూడా చదవండి...

పులివెందులలో ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్

షర్మిలపై అలాంటి రాతలేంటి? సిగ్గుండాలి: సోమిరెడ్డి చంద్రమోహన్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 20 , 2026 | 01:08 PM