Share News

ఆర్మీ జవాన్‌కు చలాన్ విధించిన అధికారి.. విధుల నుంచి తొలగింపు!

ABN , Publish Date - Nov 20 , 2026 | 04:30 PM

విధి నిర్వహణలో భాగంగా వాహన తనిఖీలు చేపట్టిన ఓ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌కు అనుకోని షాక్ తగిలింది. సీట్ బెల్ట్ పెట్టుకోలేదనే కారణంతో ఆర్మీ జవాన్‌కు చలాన్ విధించడంతో అధికారిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు.

ఆర్మీ జవాన్‌కు చలాన్ విధించిన అధికారి.. విధుల నుంచి తొలగింపు!

ఇంటర్నెట్ డెస్క్: విధి నిర్వహణలో భాగంగా వాహన తనిఖీలు చేపట్టిన ఓ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌కు అనుకోని షాక్ తగిలింది. సీట్ బెల్ట్ పెట్టుకోలేదనే కారణంతో ఆర్మీ జవాన్‌కు చలాన్ విధించడంతో అధికారిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు. ఈ ఘటన అస్సాంలోని జోర్హాట్ జిల్లాలో నవంబర్ 18న చోటుచేసుకుంది.

పట్టణంలోని ఏటీ రోడ్డులో ఉన్న అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్ సమీపంలో రవాణా శాఖ అధికారులు రోడ్డు భద్రతా తనిఖీలు నిర్వహిస్తుండగా, లిచుబారిలోని జోర్హాట్ మిలిటరీ స్టేషన్‌కు చెందిన 41వ సబ్ ఏరియా సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపారు. సీట్ బెల్ట్ ధరించలేదన్న కారణంతో డ్రైవర్‌కు చలాన్ జారీ చేశారు. ఈ క్రమంలో ఆర్మీ సిబ్బంది, ట్రాఫిక్ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చలాన్ అనంతరం ఆర్మీ వాహనం ముందు నిలబడి ఫొటోలు తీయాలని అధికారులు కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మరింత ముదిరింది.


వీడియో వైరల్.. అధికారిపై తాత్కాలిక చర్య..

ఈ ఘటనపై స్పందించిన జిల్లా రవాణా అధికారి ధనంజయ్ సైకియా.. ఆర్మీ డ్రైవర్‌ను ప్రశ్నించే సమయంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కొంత దురుసుగా వ్యవహరించినట్లు అంగీకరించారు. దీంతో సదరు అధికారిని ఒకటి లేదా రెండు రోజుల పాటు తాత్కాలికంగా విధులకు దూరంగా ఉంచినట్లు వెల్లడించారు. అయితే.. ఇది శాశ్వత సస్పెన్షన్ లేదా ఉద్యోగం నుంచి తొలగింపు కాదని స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఘటనపై జోర్హాట్ జిల్లా యంత్రాంగం విచారం వ్యక్తం చేసింది. సైనిక సిబ్బందిని అగౌరవపరచడం తమ ఉద్దేశం కాదని తెలిపింది. ఇటీవల గోలాఘాట్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాహన తనిఖీలను ముమ్మరం చేయాలని ఆదేశించినట్లు అధికారులు వివరించారు.


https://x.com/VoiceOfAxom/status/2123422917853897062?ref_src=twsrc%5Etfw


ఇవి కూడా చదవండి...

తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ.. ఉద్రిక్తం

పగిడ్యాల ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా.. కోరం లేక నిలిచిన ప్రక్రియ

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 20 , 2026 | 04:58 PM