వేగంగా దూసుకొచ్చిన కారు.. ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం.. వీడియో వైరల్
ABN , Publish Date - Nov 22 , 2026 | 12:12 PM
కారు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది.. రెప్పపాటులో పెను ప్రమాదం తప్పింది. ఒడిలో చిన్నారితో ఉన్న మహిళ తృటిలో ప్రాణాలతో బయటపడింది. ఈ భయానక దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: కేరళలోని తిరువనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. నెడుమంగాడ్-వితుర రహదారిపై మన్నార్కోణం సమీపంలో వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న దుకాణాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో దుకాణం సమీపంలో ఓ మహిళ తన ఒడిలో చిన్నారిని పట్టుకుని నిలబడి ఉండగా, మరో ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడే ఉన్నారు. అయితే కారు ఒక్కసారిగా వారి వైపు దూసుకురావడంతో అక్కడున్నవారు ప్రాణభయంతో వణికిపోయారు. కారు వారి అతి సమీపం నుంచి దూసుకెళ్లి దుకాణంలోకి చొచ్చుకెళ్లింది.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారు ఢీకొన్న ధాటికి దుకాణం షట్టర్ ధ్వంసమైంది. పీపుల్స్ లైబ్రరీ ముందు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ దుకాణం వద్ద ఉన్న మహిళ, చిన్నారితో పాటు మరో ఇద్దరు ప్రాణాపాయం నుంచి తృటిలో బయటపడ్డారు. కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు కూడా సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షణాల్లో జరిగిపోయిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లు!
22 నుంచి ఎస్‌ఐ పరీక్షల అభ్యర్థులకు హాల్ టికెట్లు
Read Latest AP News And Telangana News