Share News

కేరళం మహిళకు లాటరీలో రూ.46 కోట్లు

ABN , Publish Date - Nov 23 , 2026 | 10:44 AM

కేరళం మహిళకు లాటరీలో జాక్‌పాట్ తగిలింది. కెనడాలోని ఎడ్మాంటన్‌లో నివసిస్తున్న స్నేహ జాయ్ లాటరీలో 5 మిలియన్ డాలర్లు (రూ.46 కోట్లు) గెలుపొందారు. ఈ సందర్భంగా ఆమె హర్షం వ్యక్తం చేశారు. గత నెల 21న లాటరీకి సంబంధించిన డ్రా నిర్వహించారు.

కేరళం మహిళకు లాటరీలో రూ.46 కోట్లు

ఇంటర్నెట్ డెస్క్: కేరళం మహిళకు లాటరీలో జాక్‌పాట్ తగిలింది. కెనడాలోని ఎడ్మాంటన్‌లో నివసిస్తున్న స్నేహ జాయ్ లాటరీలో 5 మిలియన్ డాలర్లు (రూ.46 కోట్లు) గెలుపొందారు. ఈ సందర్భంగా ఆమె హర్షం వ్యక్తం చేశారు. గత నెల 21న లాటరీకి సంబంధించిన డ్రా నిర్వహించారు. స్నేహ కొన్న టికెట్‌లోని నంబర్లు మ్యాచ్ కావడంతో ఆమె రూ.30 కోట్లు గెలుపొందినట్లు వెస్టర్న్ కెనడా లాటరీ కార్పొరేషన్ నిర్వాహకులు ప్రకటించారు. దీంతో స్నేహ ఆశ్చర్యపోయారు. తాను 5 మిలియన్ డాలర్లు గెలుపొందిన విషయాన్ని నమ్మలేకపోతున్నానని చెప్పారు. ఆరోజు తన మొబైల్ ఫోన్‌లో రొటీన్‌గా నంబర్ చేసుకుంటున్నానని, లాటరీ తగిలినట్లు తెలియడంతో ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగిందని తెలిపారు. ఈ మేరకు వెస్టర్న్ కెనడా లాటరీ కార్పొరేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.


ఆ డబ్బుతో ఏం చేస్తానంటే..

తాను గెలుపొందిన రూ.4 కోట్లతో ముందుగా తాకట్టులో ఉన్న తన ఇంటిని విడిపిస్తానని స్నేహ జాయ్ తెలిపారు. తర్వాత ప్రపంచ యాత్ర చేపడతానని ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. అలాగే ఆ డబ్బులో కొంత మొత్తాన్ని తనకు ఇష్టమైన వారితో పంచుకుంటానని వెల్లడించారు. లాటరీ గెలుపొందడం తన లక్ష్యాలను చేరుకోవడంతో సమానమని ఆమె అన్నారు. ఆ డబ్బుతో తాను ఆర్థికంగా చింత లేకుండా ఉండవచ్చన్నారు. అలాగే, ఈ ఏడాది ఆరంభంలో కేరళానికే చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా చెరో మిలియన్ డాలర్లను లాటరీలో గెలుపొందారు.


ఈ వార్తలనూ చదవండి:

జపాన్‌లో బద్దలైన అగ్నిపర్వతం.. షాకింగ్ వీడియో వైరల్

వాంతి చేసుకునే ప్రయత్నంలో ఫోర్క్ మింగిన మహిళ.. చివరకు..

Updated Date - Nov 23 , 2026 | 10:44 AM