Share News

క్రమశిక్షణ అంటే ఇదీ.. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఫిదా

ABN , Publish Date - Nov 22 , 2026 | 08:53 PM

మిజోరం రాజధానిలో ప్రజలు వీధుల్లో క్రమశిక్షణతో వాహనాలు నడుపుతున్న వైనం పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను కట్టిపడేసింది. ఆయన షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.

క్రమశిక్షణ అంటే ఇదీ.. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఫిదా
Aizwal Traffic Discipline

ఇంటర్నెట్ డెస్క్: ఆ రోడ్డులో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. వాహనాలు క్యూ కట్టాయి. అయినప్పటికీ ఒక్కరు కూడా హారన్ మోగించలేదు. ముందున్న వాహనాలను ఇబ్బంది పెట్టలేదు. తమ వంతు వచ్చే వరకూ ఓపిగ్గా ఎదురు చూశారు. నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలోని దృశ్యాలు ఇవి. మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో తీసిన ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ తెగ మురిసిపోయారు. ట్రాఫిక్ క్రమశిక్షణ అంటే ఇదీ అంటూ ప్రశంసలు కురిపించారు.


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, నాలుగు రోడ్ల కూడలిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నా హారన్ మోత వినిపించలేదు. డ్రైవర్‌లు అందరూ లేన్ డిసిప్లీన్ పాటించారు. ఆగి ఉన్న వాహనాలను దాటుకుని వెళ్లిపోదామని ఒక్కరు కూడా తొందరపడలేదు. ట్రాఫిక్ సిగ్నల్స్ మారే వరకూ ఎదురు చూశారు. ‘ఇక్కడ బోలెడన్ని వాహనాలు ఉన్నాయి. అయినా హారన్ శబ్దం వినిపించదు. ఇలా ఎందుకంటే ఇక్కడి జనాలకు సహనం ఎక్కువ. మేము రూల్స్‌ను ఫాలో అవుతాము’ అని వీడియోలోని మహిళ చెప్పారు.


ఈ వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా మిజోరం ప్రజలపై ప్రశంసల వర్షం కురిపించారు. 2017లో ఐజ్వాల్ పర్యటనను గుర్తు చేసుకున్నారు. ‘అందరం కలిసి క్రమశిక్షణతో నడుచుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో నాకు అర్థం అవుతోంది. తమ క్రమశిక్షణ గురించి ఆ మహిళ ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు’ అని ఆనంద్ మహీంద్రా కామెంట్ చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

జపాన్‌లో బద్దలైన అగ్నిపర్వతం.. షాకింగ్ వీడియో వైరల్

వాంతి చేసుకునే ప్రయత్నంలో ఫోర్క్ మింగిన మహిళ.. చివరకు..

Updated Date - Nov 22 , 2026 | 08:53 PM