గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేసి రాత్రంతా శవం పక్కనే
ABN , Publish Date - Nov 24 , 2026 | 08:50 AM
మరొకరితో సంబంధం ఉందనే అనుమానంతో ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను చితకబాది హత్య చేశాడు. హత్య చేశాక రాత్రంత ఆమె మృతదేహం పక్కనే ఉన్నాడు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: మరొకరితో సంబంధం ఉందనే అనుమానంతో ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను చితకబాది హత్య చేశాడు. హత్య చేశాక రాత్రంత ఆమె మృతదేహం పక్కనే ఉన్నాడు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మహారాష్ట్రలోని పుణెలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన కోమల్ దహాలే (27), బుల్ధానాకు చెందిన శుభం ధ్యానేశ్వర్ కల్బండే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. కోమల్ విప్రోలో పనిచేస్తుండగా.. శుభం ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నాడు. ఇద్దరూ మూడేళ్లకుపైగా డేటింగ్‌లో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని ఇటీవలే నిశ్చయించుకున్నారు. వారు డేటింగ్‌లో ఉన్న విషయం ఇరు కుటుంబాలకూ తెలుసు. వారి పెళ్లికి ఇరు కుటుంబ పెద్దలూ అంగీకరించారు.
ఇదిలా ఉండగా.. కోమల్‌ను శుభం గత కొంతకాలంగా అనుమానించడం ప్రారంభించాడు. ఆమె మరొకరితో సంబంధం పెట్టుకుందని, తనను మోసం చేస్తోందని అనుమానం పెంచుకున్నాడు. ఆమెతో తరచూ గొడవపెట్టుకునేవాడు. ఈ క్రమంలో ఆదివారం పుణెలోని హింజవాడి ఏరియాలో కోమల్ పేయింగ్ గెస్ట్‌కు వెళ్లాడు. ఆరోజు రాత్రి కూడా ఆమెతో గొడవపడ్డాడు. అర్ధరాత్రి ఆమెపై ఘోరంగా దాడిచేశాడు. కోమల్ తల, మెడపై బలంగా కొట్టాడు. ఆమెను కాళ్లతో తన్నాడు. దీంతో దెబ్బలకు తట్టుకోలేక ఆమె చనిపోయింది. రాత్రంతా కోమల్ శవం పక్కనే ఉండి తర్వాతి రోజు పోలీసుల ముందు అతను లొంగిపోయాడు.
ఈ వార్తలు కూడా చదవండి...
పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!