Share News

‘వెస్ట్‌ బెంగాల్‌’ ఇక ‘పశ్చిమ్‌ బంగా’!

ABN , Publish Date - Nov 24 , 2026 | 01:45 AM

పశ్చిమ బెంగాల్‌ (వెస్ట్‌ బెంగాల్‌) రాష్ట్ర పేరును ‘పశ్చిమ్‌ బంగా’గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది

‘వెస్ట్‌ బెంగాల్‌’ ఇక ‘పశ్చిమ్‌ బంగా’!
West Bengal

  • పేరు మార్పునకు ఆ రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం

కోల్‌కతా, నవంబరు 23: పశ్చిమ బెంగాల్‌ (వెస్ట్‌ బెంగాల్‌) రాష్ట్ర పేరును ‘పశ్చిమ్‌ బంగా’గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు డిసెంబరు 9న అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు సీఎం సువేందు అధికారి సోమవారం వెల్లడించారు. రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపాదిత తీర్మానం ఆమోదించిన తర్వాత.. దాన్ని కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపుతామని సీఎం సువేందు క్యాబినెట్‌ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. రాష్ట్ర పేరు మార్పు ప్రతిపాదన బిల్లుతో పాటు ఎనిమిది ముఖ్యమైన బిల్లులను వచ్చే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తీసుకురానున్నట్లు తెలిపారు. పేరు మార్పును కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిన అనంతరం.. ప్రస్తుతం బెంగాలీ భాషలో ఉన్న ‘పశ్చిమ్‌ బంగా’ పేరునే అధికారిక పత్రాలు, పరిపాలనా రికార్డుల్లో ఇంగ్లిష్‌, ఇతర భాషల్లోనూ కూడా అదేవిధంగా పేర్కొననున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

దేశవ్యాప్తంగా త్వరలో అనర్హుల రేషన్ కార్డుల ఏరివేత.. కేంద్రం రంగం సిద్ధం

కేబీసీపై వైరల్ వీడియో ఫేక్.. అమితాబ్ అసలు ఆ ప్రశ్నే అడగలేదట

Updated Date - Nov 24 , 2026 | 04:09 AM