Share News

యాంటీ డ్రోన్‌ క్షిపణి జ్వాలా-ఎంకే 1 పరీక్ష సక్సెస్‌

ABN , Publish Date - Nov 24 , 2026 | 01:49 AM

ప్రైవేటు రంగంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి స్వయంచాలక యాంటీ డ్రోన్‌ సూక్ష్మ క్షిపణి వ్యవస్థ జ్వాలా-ఎంకే 1 పరీక్ష విజయవంతమైంది

యాంటీ డ్రోన్‌ క్షిపణి జ్వాలా-ఎంకే 1 పరీక్ష సక్సెస్‌
missile

న్యూఢిల్లీ, నవంబరు 23: ప్రైవేటు రంగంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి స్వయంచాలక యాంటీ డ్రోన్‌ సూక్ష్మ క్షిపణి వ్యవస్థ జ్వాలా-ఎంకే 1 పరీక్ష విజయవంతమైంది. నోయిడాకు చెందిన రక్షణ రంగ ప్రైవేటు సంస్థ ఐజీ డిఫెన్స్‌ ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ పరీక్షా కేంద్రంలో దీన్ని విజయవంతంగా పరీక్షించినట్లు సోమవారం ఆ సంస్థ వెల్లడించింది. గరిష్ఠంగా 5 కిలోమీటర్ల పరిధిలోని శత్రు డ్రోన్లు, వైమానిక లక్ష్యాలను గుర్తించి, వాటి స్వభావాన్ని విశ్లేషించి అడ్డుకుని ధ్వంసం చేసేలా జ్వాలా-ఎంకే 1ను రూపొందించారు. ప్రస్తుతం యుద్ధాల్లో తక్కువ ఖర్చుతో డ్రోన్లను కూల్చేందుకు అత్యంత ఖరీదైన క్షిపణులను వాడాల్సి వస్తోందని ఐజీ డిఫెన్స్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అనూప్‌ శర్మ అన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగానే తక్కువ ఖర్చుతో ఎక్కువ సంఖ్యలో తయారు చేసుకోగలిగేలా జ్వాలా-ఎంకే 1ను రూపొందించినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి..

దేశవ్యాప్తంగా త్వరలో అనర్హుల రేషన్ కార్డుల ఏరివేత.. కేంద్రం రంగం సిద్ధం

కేబీసీపై వైరల్ వీడియో ఫేక్.. అమితాబ్ అసలు ఆ ప్రశ్నే అడగలేదట

Updated Date - Nov 24 , 2026 | 03:30 AM