Share News

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. నలుగురు చిన్నారులు మృతి

ABN , Publish Date - Nov 24 , 2026 | 09:31 AM

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కనౌజ్ జిల్లాలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఆగి ఉన్న పాఠశాల బస్సును వేగంగా వచ్చిన ట్రక్కు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. నలుగురు చిన్నారులు మృతి
Agra Lucknow Expressway

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కనౌజ్ జిల్లాలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఆగి ఉన్న పాఠశాల బస్సును వేగంగా వచ్చిన ట్రక్కు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. మంగళవారం ఉదయం థాథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని 209 కిలోమీటర్ మార్క్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు పాఠశాల విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో 35 మంది గాయపడ్డారు. సుమారు 50 మంది విద్యార్థులు, ఆరుగురు ఉపాధ్యాయులతో కూడిన బృందం విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ఆగి ఉన్న సమయంలో వెనుక నుంచి ట్రక్కు వేగంగా దూసుకురావడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.


ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను అంబులెన్సుల్లో తిర్వాలోని వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కనౌజ్ జిల్లా మేజిస్ట్రేట్ అశుతోష్ మోహన్ అగ్నిహోత్రి, ఎస్పీ వినోద్ కుమార్ ఆసుపత్రికి చేరుకుని చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ దుర్ఘటనతో విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కరీంనగర్‌ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?

నిమ్స్‌లో అడుగడుగునా అవినీతి

Read Latest AP News And Telangana News

Updated Date - Nov 24 , 2026 | 09:57 AM