హనుమకొండలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హౌస్ అరెస్ట్
ABN , Publish Date - Nov 11 , 2026 | 09:51 AM
మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు హనుమకొండలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు.
హనుమకొండ, నవంబర్ 11: మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు (బుధవారం) హనుమకొండలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. అయితే భట్టి విక్రమార్క పర్యటనను అడ్డుకుంటామని బీఆర్‌ఎస్ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు గులాబీ పార్టీ నేతలను ముందస్తు అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. అలాగే వడ్డేపల్లిలోని తన నివాసంలో వినయ్ భాస్కర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముందస్తుగా అరెస్ట్ చేసిన పలువురు నేతలను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
హనుమకొండకు భట్టి
ఈరోజు హనుమకొండలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాజీపేటలో రూ.10 కోట్లతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా మైరా స్కిన్ క్లినిక్‌ను ప్రారంభించనున్నారు.
ఇవి కూడా చదవండి...
సోనియాగాంధీ ఆత్మకథలో మూడు తప్పులు.. తేదీల్లో పొరపాట్లు
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సత్తా చాటిన ఏపీ.. మంత్రి నారాయణకు అవార్డులను అందించనున్న రాష్ట్రపతి ముర్ము
Read Latest Telangana News And Telugu News