Share News

ఫిబ్రవరి 2న ‘టీచర్‌ ఎమ్మెల్సీ’ తుది ఓటర్ల జాబితా

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:47 AM

కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల తుది ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 2న ప్రచురించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

ఫిబ్రవరి 2న ‘టీచర్‌ ఎమ్మెల్సీ’ తుది ఓటర్ల జాబితా

అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల తుది ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 2న ప్రచురించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. వచ్చే నెల 23న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు వెల్లడించింది. రెండు టీచర్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణకు గతంలో ఇచ్చిన షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. డిసెంబరు 18 నాటికి రెండు టీచర్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా ముసాయిదా తయారీ, ముద్రణ పూర్తి చేయనున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 05:47 AM