విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు
ABN , Publish Date - Nov 10 , 2026 | 07:41 PM
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవలను రద్దు చేశారు. విశాఖపట్నం విమానాశ్రయాన్ని 'అధికారిక ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్' ల జాబితా నుంచి మినహాయిస్తూ (డీనోటిఫై చేస్తూ) కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవలను రద్దు చేశారు. విశాఖపట్నం విమానాశ్రయాన్ని 'అధికారిక ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్' ల జాబితా నుంచి మినహాయిస్తూ (డీనోటిఫై చేస్తూ) కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భోగాపురం విమానాశ్రయానికే అంతర్జాతీయ హోదా కల్పించింది. కొత్తగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్‌గా కేంద్రం గుర్తించడంతో విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు ఇమ్మిగ్రేషన్ హోదాను రద్దు చేశామని ప్రకటించింది. ఇకపై విదేశీ విమానాల రాకపోకలు భోగాపురం నుంచే కొనసాగుతాయని తెలిపింది. అంతర్జాతీయ ప్రయాణికుల ఇమ్మిగ్రేషన్ తనిఖీలు, విదేశీ విమానాల సేవలు ఇక భోగాపురం విమానాశ్రయంలోనే లభ్యమవుతాయని వివరించింది.
రద్దుకు కారణం..
పాత విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి వాణిజ్య విమాన సేవలు ఈ ఏడాది ఆగస్టు 17 నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. అన్ని పౌర విమాన కార్యకలాపాలు కొత్తగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మారాయి. ఈ నేపథ్యంలో విశాఖ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ సేవలను రద్దు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికల విజయంతో విర్రవీగొద్దు.. 2029 ఎన్నికలే లక్ష్యం: సీఎం చంద్రబాబు
గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..