స్థానిక ఎన్నికల విజయంతో విర్రవీగొద్దు.. 2029 ఎన్నికలే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 10 , 2026 | 03:22 PM
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం రాజధాని అమరావతిలో కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. అలాగే పలు కీలక విషయాల్లో మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
అమరావతి, నవంబర్10: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం రాజధాని అమరావతిలో కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. అలాగే పలు కీలక విషయాల్లో మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల విజయాన్ని చూసుకొని గర్వంతో విర్రవీగొద్దని మంత్రులకు సీఎం స్పష్టం చేశారు. ఒద్దికగా ఉండండి.. భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలని వారిని అప్రమత్తం చేశారు. మనం ప్రజలకు మేలు చేయాలని వారితో సీఎం అన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో చేస్తున్నామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
2029 ఎన్నికలపై దృష్టి పెట్టాలని.. ఆ దిశగా అందరం పని చేయాలని అన్నారు. ఇక కూరగాయల ధరలు తగ్గాయని.. బియ్యం ధరలు కూడా తగ్గించేందుకు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలకు ధరల భారం ఉండకూడదని అన్నారు. మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా ప్రజలకు ఉపయోగపడాలని ఈ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇక పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తరువాత సొసైటీ ఎన్నికలు ఉంటాయని తెలిపారు. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత మనమంతా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో రైతు బజార్లలో ధర తగ్గించి బియ్యం విక్రయిస్తున్నామని ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆర్నబ్, మురసు తుఫాన్ నేపథ్యంలో కర్ణాటక, తెలంగాణ నుంచి వచ్చిన సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణకు బాగా పని చేశారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. సీఎం చంద్రబాబు ఫోన్ చేయడంతో.. ఆయా రాష్ట్రాల నుంచి విద్యుత్ సిబ్బంది ఏపీకి వచ్చారని వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పీవీ సింధుకు అరుదైన గౌరవం.. అభినందనలు తెలిపిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..
Read Latest AP News And Telugu News