Share News

గూడూరులో దారుణం.. రూ.500 అప్పు తిరిగివ్వలేదని వ్యక్తిపై వేడి నూనె పోసిన మహిళ

ABN , Publish Date - Nov 10 , 2026 | 04:43 PM

నగదు అప్పు తీసుకుని.. తిరిగి చెల్లించలేదని ఓ వ్యక్తిపై మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు అతడిపై సలసల కాగే నూనె పోసింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దారుణ సంఘటన నెల్లూరు రూరల్ మండలం మాదరాజు గూడూరులో మంగళవారం చోటు చేసుకుంది.

గూడూరులో దారుణం.. రూ.500 అప్పు తిరిగివ్వలేదని వ్యక్తిపై వేడి నూనె పోసిన మహిళ
Burn Patient

నెల్లూరు, నవంబర్10: నగదు అప్పు తీసుకుని.. తిరిగి చెల్లించలేదని ఓ వ్యక్తిపై మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు అతడిపై సలసల కాగే నూనె పోసింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దారుణ సంఘటన నెల్లూరు రూరల్ మండలం మాదరాజు గూడూరులో మంగళవారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై శీనయ్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి.. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గతంలో ఓ మహిళ వద్ద శీనయ్య అనే వ్యక్తి రూ.500 అప్పు తీసుకున్నాడు. ఆ నగదు తిరిగి చెల్లించాలని అతడిని ఈ రోజు సదరు మహిళ నిలదీసింది.


తన వద్ద అంత నగదు లేదని ఒకింత ఆగ్రహంతో ఆమెకు బదులిచ్చాడు. దీంతో మండిపడిన ఆ మహిళ తన ఇంట్లో బాగా కాగిన నూనెను అతడిపై పోసింది. దీంతో అతడు తీవ్ర గాయాలపాలై.. బాధతో బిగ్గరగా అరిచాడు. స్థానికులు వెంటనే స్పందించి సమీపంలోని ఆసుపత్రికి క్షతగాత్రుడిని తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అతడిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక ఎన్నికల విజయంతో విర్రవీగొద్దు.. 2029 ఎన్నికలే లక్ష్యం: సీఎం చంద్రబాబు

గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 10 , 2026 | 04:57 PM