ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం
ABN , Publish Date - Nov 10 , 2026 | 03:36 PM
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుని.. వాటికి ఆమోద ముద్ర వేసింది.
అమరావతి, నవంబర్10: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుని.. వాటికి ఆమోద ముద్ర వేసింది.
కేబినెట్ నిర్ణయాలివే..
రాష్ట్రంలో కొత్తగా ఏవీజీసీ-ఎక్స్ఆర్ (AVGC-XR) పాలసీ 2026-31, ఏపీ రోబోటిక్స్ - ఫిజికల్ ఏఐ విధానాలకు ఆమోదం.
ఏపీ సెమీ కండక్టర్, డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 2024-29 ముసాయిదా సవరణలకు గ్రీన్ సిగ్నల్.
విశాఖ జిల్లా భీమునిపట్నంలో భారీ పెట్టుబడి.. రూ.31,387 కోట్లతో ఏఎం ఇంటెలిజెన్స్ (AM Intelligence) ఆధ్వర్యంలో 512 మెగావాట్ల గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం.
నాయుడుపేటలో రూ.4000.20 కోట్లతో కార్బన్ కాస్మో బ్యాటరీ మెటీరియల్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం.
తిరుపతిలో రూ.700 కోట్లతో డిక్సన్ టెక్నాలజీస్‌కు స్థల కేటాయింపునకు ఆమోదం.
విజయనగరం జిల్లా భోగాపురంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ గిగా స్కేల్ ఏఐ (AI) డేటా సెంటర్‌కు సుమారు 25 ఎకరాలు కేటాయింపు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.570.20 కోట్లతో ఈపాక్ (Epack) ఏఐ డేటా సెంటర్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. ఈ యూనిట్‌తో 2,565 మందికి ఉపాధి అవకాశాలు.
నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో హెటిరో గ్రూప్ ఫార్మా సంస్థలకు 173.82 ఎకరాల స్థల కేటాయింపునకు పచ్చజెండా.
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.236.92 కోట్లతో రవళి స్పిన్నర్స్ విస్తరణ ప్రాజెక్టు. దీని వల్ల1,569 మందికి ఉపాధి లభిస్తుంది.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా 30 ఎకరాల్లో ఫ్లో (FICCI FLO) ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం.
అన్నమయ్య జిల్లాలో 56.82 ఎకరాల్లో స్కికార్ప్ (SKICORP) ఇంటిగ్రేటెడ్ ఫుట్‌వేర్ పార్క్, తంబళ్లపల్లెలో సుమారు 21 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ (MSME) పార్కు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.
రాష్ట్రంలో ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్డు భద్రత కోసం డీజీపీ ఆధ్వర్యంలో మంగళగిరి కేంద్రంగా ప్రత్యేక డైరెక్టరేట్ (DTMRS) ఏర్పాటుకు ఆమోదం.
రాజధాని పరిధిలోని శాఖమూరులో కేంద్రీయ విద్యాలయానికి (KVS) 5 ఎకరాల లీజు, స్టాంప్ డ్యూటీ మినహాయింపునకు ఆమోదం.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ప్రభుత్వ ఐటీఐ (ITI) కాలేజీ ఏర్పాటు కోసం 2 ఎకరాల స్థలం కేటాయింపు.
తిరుమల శ్రీవారి ఆలయంలో 'ప్రధాన సన్నిధి యాదవ', 'సన్నిధి యాదవ' పోస్టుల ఏర్పాటుకు ఆమోదం.
దేవాదాయ శాఖలో సూపరింటెండెంట్ ఇంజనీర్ హోదాలో 'ముఖ్య స్థపతి' పోస్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.
ఎన్టీఆర్, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో కొత్తగా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతి.
రాష్ట్రంలో థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా SMR టెక్నాలజీతో అణు విద్యుత్ ప్లాంట్ల (Nuclear Power) ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఆమోదం.
విజయవాడలో 15 మెగావాట్ల వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు కోసం మున్సిపల్ కార్పొరేషన్‌కు 5.50 ఎకరాల ఏపీ జెన్కో భూమి ఉచిత బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం192.68 ఎకరాల వక్ఫ్ భూమి 30 ఏళ్ల దీర్ఘకాలిక లీజుకు ఆమోదం.
నాయుడుపేట సెజ్‌లో గతంలో వెబ్‌సోల్ రెన్యువబుల్స్, మెట్రో డెకరేటివ్ సంస్థలకు చేసిన భూ కేటాయింపుల రద్దుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికల విజయంతో విర్రవీగొద్దు.. 2029 ఎన్నికలే లక్ష్యం: సీఎం చంద్రబాబు
పీవీ సింధుకు అరుదైన గౌరవం.. అభినందనలు తెలిపిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
Read Latest AP News And Telugu News