Share News

తొలి మహిళా సహస్రావధానం

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:44 AM

తెలుగు సాహిత్య రంగంలో తొలిసారిగా మహిళా సహస్రావధానం జరగనుంది. అవధాని బులుసు అపర్ణ డిసెంబరు 10 నుంచి జనవరి 3 వరకు 25 రోజులపాటు విజయవాడలో ఈ అవధానాన్ని నిర్వహించనున్నారు.

తొలి మహిళా సహస్రావధానం

  • డిసెంబరు 10 నుంచి 25 రోజులపాటు నిర్వహించనున్న బులుసు అపర్ణ

విజయవాడ కల్చరల్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): తెలుగు సాహిత్య రంగంలో తొలిసారిగా మహిళా సహస్రావధానం జరగనుంది. అవధాని బులుసు అపర్ణ డిసెంబరు 10 నుంచి జనవరి 3 వరకు 25 రోజులపాటు విజయవాడలో ఈ అవధానాన్ని నిర్వహించనున్నారు. పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ కార్యక్రమం ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం జరగనుంది. డిసెంబరు 10న మాడుగుల నాగఫణిశర్మ అవధానాన్ని ప్రారంభిస్తారు. జనవరి 3న గరికిపాటి నరసింహారావు సమక్షంలో ధారణ, విజయోత్సవం జరగనుంది.

జనవరి 3న 750 పద్యాల ధారణతోపాటు ఆశుపద్యాలు, ఘంటావధానంతో వెయ్యి పద్యాలను పూర్తి చేయనున్నారు. హిందూ హైస్కూల్స్‌ కమిటీ జనరల్‌ కరస్పాండెంట్‌ గోపిశెట్టి మల్లయ్య, కేబీఎన్‌ కళాశాల కరస్పాండెంట్‌ టి.శ్రీనివాసు, అవధాని అపర్ణ మంగళవారం విలేకరులకు ఈ వివరాలు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 05:45 AM