ఘట్‌కేసర్ బస్టాండ్‌లో మరుగు దొడ్ల మూసివేత
ABN , Publish Date - Nov 11 , 2026 | 07:03 AM
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు కురవక భూగర్భ జలాలు రోజురోజుకు తగ్గి.. నీటి కొరత తీవ్రమవుతోంది.
నీళ్లు లేవు.. రేపు రండి అన్న బోర్డుతో ప్రయాణికులకు షాక్
ఘట్‌కేసర్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు కురవక భూగర్భ జలాలు రోజురోజుకు తగ్గి.. నీటి కొరత తీవ్రమవుతోంది. దీంతో నీళ్లు లేవని చెబుతూ మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ బస్టాండ్‌లో సులబ్ కాంప్లెక్స్ మరుగు దొడ్లను మంగళవారం మూసేశారు. ‘నీళ్లు లేవు.. రేపు రండి’ అనే బోర్డు దర్శనమివ్వడంతో ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు.
నవంబరులోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఎండాకాలం ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందోనని స్థానికుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. నిత్యం వందల మంది రాకపోకలు సాగే పట్టణ కేంద్ర బస్టాండ్‌లో మరుగు దొడ్లను మూసేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండ్‌లో నీటి సౌకర్యానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.