Share News

సోనియాగాంధీ ఆత్మకథలో మూడు తప్పులు.. తేదీల్లో పొరపాట్లు

ABN , Publish Date - Nov 11 , 2026 | 09:21 AM

సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ గ్రంథం నిన్న (మంగళవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మార్కెట్‌లోకి ఈ పుస్తకం అందుబాటులోకి రాగానే రాజకీయ దుమారం రేగింది.

సోనియాగాంధీ ఆత్మకథలో మూడు తప్పులు.. తేదీల్లో పొరపాట్లు
Sonia Gandhi

ఇంటర్నెట్ డెస్క్: సోనియాగాంధీ (Sonia Gandhi) ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ గ్రంథం నిన్న (మంగళవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మార్కెట్‌లోకి ఈ పుస్తకం అందుబాటులోకి రాగానే రాజకీయ దుమారం రేగింది. పలు చర్చలకు దారితీసింది. మరోవైపు ఈ ఆత్మకథలో చారిత్రక సంఘటనలకు సంబంధించి మూడు దోషాలు దొర్లినట్టు కొందరు గుర్తించారు. అన్నాహజారే ఉద్యమం, ఆర్‌ఎస్‌ఎస్ ఆవిర్భావం, అహ్మద్ పటేల్ మరణం.. ఈ అంశాల గురించి సోనియాగాంధీ తప్పుగా రాశారని కనిపెట్టారు.


ఆ తప్పులు ఏంటంటే..?

దేశవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని అన్నాహజారే 2012లో చేపట్టారని సోనియాగాంధీ తన ఆత్మకథలోని 33వ అధ్యాయం(పేజీ నెం.461)లో రాశారు. వాస్తవానికి 2011 ఏప్రిల్‌లో ఆ ఉద్యమం ఊపందుకుంది. బలమైన అవినీతి నిరోధక చట్టం డిమాండ్ చేస్తూ అన్నాహజారే నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆ సమయంలో అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ, బాబా రామ్‌దేవ్ లాంటి ప్రముఖులూ నిరసనలు నిర్వహించారు. అలాగే 24వ అధ్యాయం(పేజీ నెం.338)లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) 1921లో ఏర్పడిందని సోనియాగాంధీ పేర్కొన్నారు. నిజానికి ఆర్‌ఎస్‌ఎస్ ఆవిర్భవించింది 1925 సెప్టెంబరులో. కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ మరణ తేదీ విషయంలోనూ ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’లో తప్పు దొర్లింది. ఆయన 2022లో మరణించారని ఆ పుస్తకంలోని 29వ అధ్యాయం(పేజీ నెం.401)లో ఉంది. అయితే అహ్మద్ పటేల్ 2020లోనే మరణించారు.


ఈ వార్తలూ చదవండి

మోదీ.. కళ్లలోకి చూసిమాట్లాడరు: సోనియాగాంధీ

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 09:30 AM