Share News

వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత.. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన అధికారులు

ABN , Publish Date - Aug 18 , 2026 | 06:19 AM

వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం రాత్రికి రాత్రే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించినట్లు తెలుస్తోంది. నర్సంపేట మెడికల్ కాలేజీ వద్ద ఇటీవలే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత.. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన అధికారులు
Peddi Sudarshan Reddy

వరంగల్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న (సోమవారం) రాత్రికి రాత్రే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) విగ్రహాన్ని అధికారులు తొలగించినట్లు తెలుస్తోంది. నర్సంపేట మెడికల్ కాలేజీ వద్ద ఇటీవలే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. పోలీస్ బలగలా పహారా మధ్య పెద్ది విగ్రహాన్ని తొలగించారు.


మీడియాను పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన స్థలం వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి జన్మదినం రోజే విగ్రహం తొలగించడంపై చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, కాంగ్రెస్ నేతల విగ్రహాల దగ్గర పోలీసులు మోహరించారు.


వార్తలు కూడా చదవండి...

22-A పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడితే సహించబోం: మంత్రి పొంగులేటి

నటి అనసూయకు బిగ్ షాక్..

హైదరాబాద్‌లో యువతి దారుణ హత్య

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 07:23 AM