‘బస్సు’ తుస్సు.. ‘మహాలక్ష్మి’కి ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసుల కొరత
ABN , Publish Date - Sep 19 , 2026 | 10:53 AM
రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో అమలు చేస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యంపై అధికారులు కోత విధిం చారు.
హనుమకొండ బస్‌స్టేషన్‌లో తగ్గించిన అధికారులు
అదే మార్గాల్లో సూపర్ లగ్జరీ, డీలక్స్ సర్వీస్‌ల పెంపు
ఆర్టీసీ అధికారుల తీరుపై మహిళా ప్రయాణికుల మండిపాటు
హనుమకొండ: రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో అమలు చేస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యంపై అధికారులు కోత విధిం చారు. హనుమకొండ బస్‌స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సులు తగ్గించడంతో మహిళా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క హనుమకొండ బస్‌స్టేషన్ నుంచే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలలోని ఇతర డిపోల్లో కూడా ఎక్స్‌ప్రెస్ తగ్గించినట్లు తెలుస్తోంది.
ఎక్స్‌ప్రెస్ బస్సుల కొరత
వరంగల్ రీజనల్ పరిధిలో హనుమకొండ బస్‌స్టేషన్ నుంచి నిజామాబాద్, హైదరాబాద్‌కు వెళ్లే రూట్లలో ప్రధానంగా ఎక్స్‌ప్రెస్ బస్సులను అధికారులు తగ్గించారు. హనుమకొండ బస్టాండ్ నుంచి ఖమ్మం, ఏటూరునాగారం, నిజామాబాద్, హైదరాబాద్ దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ అధికారులు ఎక్స్‌ప్రెస్ బస్సులను తగ్గించి సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులను అదనంగా నడుపుతున్నారు. దీంతో హనుమకొండ నుంచి హైదరాబాద్, నిజామాబాద్ ఇతర రూట్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సులకోసం బస్టాండ్ ప్రాంగణంలో గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళా ప్రయా ణికులు వాపోతున్నారు.
పాయింట్ మార్పు
హనుమకొండ బస్టాండ్‌లో హైదరాబాద్ వెళ్లే ప్రయాణికు లకు గతంలో హైదరాబాద్ 1వ ప్లాట్‌ఫామ్‌కు ఎక్స్‌ప్రెస్ బస్సులు వచ్చేవి. నెల రోజుల నుంచి వరంగల్ రీజినల్ అధికారులు చేసిన మార్పులతో ఎక్స్‌ప్రెస్ బస్సుల స్థానంలో సూపర్ లగ్జరీ, డీలక్స్, రాజధాని బస్సులను ప్లాట్‌ఫామ్ మీద నిలుపుతున్నారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా ప్రయాణికులు, ఎక్స్‌ప్రెస్ బస్సులకోసం ప్లాట్‌ఫామ్ మీద నిలబడినా బస్సులు రాక, చేసేదేమీ లేక అధిక డబ్బులు చెల్లించి రాజధాని, డీలక్స్, సూపర్‌లగ్జరీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.
ఆర్టీసీ అధికారుల తీరుపై మండిపాటు
ప్రజా పాలనలో భాగంగా మహిళలకు ఎక్స్‌ప్రెస్ బస్సులలో రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లిన ఉచితంగా ఆధార్ కార్డు ద్వారా ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఎక్స్‌ప్రెస్ బస్సులను తగ్గించి మహిళలకు మహాలక్ష్మి పథకాన్ని దూరం చేస్తోందని ఆర్టీసీ అధికారులపై మండిపడుతున్నారు.
వరంగల్ రీజినల్ పరిధిలో 20 రోజులుగా వివిధ రూట్లలో నడిపే ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీస్‌లను తగ్గింపు చేయడంపై ప్ర యాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణించే మహిళలు, అన్ని వర్గాల ప్రజలు.. సూపర్‌లగ్జరీ, ఇతర బస్సులను ఏర్పాటు చేయడంతో తీవ్రంగా ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అనువైన బస్సు సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరుతున్నారు.
హైదరాబాద్‌కు ఎక్స్‌ప్రెస్ బస్సుల ప్లాట్‌ఫామ్ మార్పు
ఆర్టీసీ ఆర్‌ఎం భవాని ప్రసాద్
ఎక్స్‌ప్రెస్ బస్సుల కోసం హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులకు ప్లాట్ ఫామ్‌ను మార్గాం. ఇటీవల అన్ని రూట్లల్లో ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీస్‌లను నడపాలనే ఉద్దేశంతో ఎక్స్‌ప్రెస్ బస్సులను పెంచాం. వాటి స్థానంలో డీలక్స్ బస్సులు, ఇతర బస్సు సర్వీస్‌లు పెంచాం. ఎక్స్‌ప్రెస్ బస్సులను వేరే రూట్లకు మార్చడం వల్ల కొన్ని సర్వీస్‌లు తగ్గించాల్సి వచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
300 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అబద్ధం
Read Latest AP News And Telangana News And International News And Telugu News