ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో రాతి గుహ
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:12 PM
ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామరవాయి, భూపతిపూర్ గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో గుహ ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది.
ఆది మానవులు నివసించినట్లు ఆనవాళ్లు
తాడ్వాయి(ములుగు): ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామరవాయి, భూపతిపూర్ గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో గుహ ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. జింకల పడ అనే అటవీ ప్రాంతంలో గుడ్డేలుగు గుహ ఉందని, అటు వైపు వెళ్తే ప్రమాదమని ప్రచారం జరుగుతోంది. దామరవాయి గ్రామానికి చెందిన యువకుడు కార్తీక్ తన స్నేహితులు మహేష్, నాగరాజులతో కలి సి ఈనెల 20న గుహను సందర్శించాడు. గ్రామం నుంచి గుహ జాడలు గుర్తిస్తూ గంటలపాటు అడవిలో వీరు ప్రయాణించారు. చివరకు గుహను గుర్తించామని కార్తీక్ తెలిపాడు. సోమవారం గుహను సందర్శించగా అది మూడు మీటర్ల సొరంగం కనిపించింది.
లోపల సన్నటి దారి ఉంది. వ్యక్తి పడుకొని వెళ్లేలా మూడు మీటర్ల పొడవుతో సొరంగం కనిపించింది. అది దాటిన తర్వాత గది ఉంది. అందు లోవ్యక్తి పడుకునే విధంగాఏర్పాటు చేసి ఉంది. ఈ గుహలో గబ్బిలాలు వందల సంఖ్యలో వేలాడుతూ కనిపించాయి. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ గుహను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. ఆనవాలనుబట్టి ఇందులో ఆదిమానవులు నివసించి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. గుహకు దగ్గరలోనే దామరవాయి రాక్షస సమాధులు ఉన్నాయని, ఈ ప్రాంతంలో అదిమానవులు నివసించారనడానికి ఇది నిదర్శనమని చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
హరీశ్‌కు తుమ్మిడిహట్టి భయం పట్టుకుంది!
Read Latest AP News And Telangana News And International News And Telugu News