ఏపీకి ఆర్నబ్ తుఫాన్ ముప్పు.. 20 జిల్లాల కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
ABN , Publish Date - Oct 27 , 2026 | 11:40 AM
ఏపీకి ఆర్నబ్ తుఫాన్ ముప్పు పొంచివున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర, ప్రభావిత జిల్లాల కంట్రోల్ రూమ్ నంబర్లు ఏర్పాటు చేశారు.
అమరావతి, అక్టోబర్ 27: ఏపీకి ఆర్నబ్ తుఫాన్ ముప్పు పొంచివున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తుఫాన్ ముంచుకొస్తున్న తరుణంలో ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్నందున తీర ప్రాంత జిల్లా కలెక్టర్లు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర, ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్ నంబర్లు ఏర్పాటు చేశారు.
మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా తుఫాన్ సమస్యలకు వేగవంతమైన పరిష్కారం పొందవచ్చి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే అత్యవసర సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ నంబర్లు 📞 112 | 📞 1070 | 📞 1800 425 0101ను సంప్రదించాలన్నారు.
ప్రభావిత జిల్లాల కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ల వివరాలు
శ్రీకాకుళం : 08942240557
విజయనగరం: 8922236947
పార్వతీపురం మన్యం : 08963450347
అల్లూరి సీతారామరాజు : 8935293448
విశాఖపట్నం: 0891-2590102 / 0891-2590100
అనకాపల్లి : 08924-222888 / 08924-226599 / 08924-225999
కాకినాడ: 0884-2356801 / 9849903879
కోనసీమ : 8856293104
తూర్పు గోదావరి : 8832944455
పశ్చిమ గోదావరి : 08816-299181
ఏలూరు: 18002331077 / 9494041419
పోలవరం : 18004254225
తిరుపతి : 0877 2236007
మార్కాపురం : 9248702500
కృష్ణా: 08672 252399
ఎన్టీఆర్ : 9154970454
గుంటూరు : 0863-2234014
బాపట్ల: 08643-220226
ప్రకాశం : 08592 295600 / 18004250277
నెల్లూరు : 7995576699
ఇవి కూడా చదవండి...
పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. ప్రజలకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
విశాఖలో తుఫాన్ ముప్పు.. ప్రజలకు కలెక్టర్ అత్యవసర విజ్ఞప్తి
Read Latest AP News And Telugu News