‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’.. కర్నూల్ సోలార్ ప్లాంట్‌పై సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 27 , 2026 | 09:39 AM
కర్నూలులో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
అమరావతి, అక్టోబర్ 27: కర్నూలులో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. కర్నూలు జిల్లాలోని 2,400 ఎకరాలలో 600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీ మళ్లీ ఒక కీలక శక్తిగా అవతరిస్తుందనడానికి ‘SAEL’ సోలార్ ప్లాంట్ ప్రత్యక్ష నిదర్శనమని చెప్పుకొచ్చారు. ‘చెప్పాం.. చేస్తున్నాం’ (#CheppaamChestunnaam) అని, ఇచ్చిన మాట ప్రకారమే ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి చూపించామని ఎక్స్‌లో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలి: హోం మంత్రి అనిత ఆదేశం
ప్రజల ప్రాణ రక్షణకే తొలి ప్రాధాన్యం
Read Latest AP News And Telugu News