ప్రజల ప్రాణ రక్షణకే తొలి ప్రాధాన్యం
ABN , Publish Date - Oct 27 , 2026 | 06:33 AM
ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యంగా ఉండాలని సూచించారు. అధికార యంత్రాంగానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తీర ప్రాంత, లోతట్టు గ్రామాలు, మత్స్యకార ఆవాసాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గేవరకు తన పరిధిలోని శాఖల సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్