Share News

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. ప్రజలకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

ABN , Publish Date - Oct 27 , 2026 | 11:08 AM

విజయనగరం జిల్లాలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఈరోజు (మంగళవారం) అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. ప్రజలకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
Minister Nara lokesh

అమరావతి, అక్టోబర్ 27: విజయనగరం జిల్లాలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఈరోజు (మంగళవారం) అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. సిరిమానోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.


లోకేశ్ పోస్ట్

‘ఉత్తరాంధ్ర ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, భక్తుల కొంగుబంగారం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. విజయనగరం చారిత్రక- ఆధ్యాత్మిక వైభవానికి, సంస్కృతికి ప్రతీక శ్రీ పైడితల్లి అమ్మవారి వైభవ సిరిమానోత్సవం. అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు.


విజయనగరం జిల్లాలో ఈరోజు జరిగే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం కోసం అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకే సిరిమాను రథోత్సవాలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. అమ్మవారిని దర్శించుకోవటానికి ఆలయం దగ్గర భక్తులు బారులు తీరారు. దాదాపు మూడు వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అయితే అమ్మవారి ఉత్సవాలపై తుఫాన్ ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

ప్రజల ప్రాణ రక్షణకే తొలి ప్రాధాన్యం

‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’.. కర్నూల్ సోలార్ ప్లాంట్‌పై సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 11:25 AM