Share News

రక్తపోటు పెరిగితే?

ABN , Publish Date - Oct 27 , 2026 | 05:08 AM

కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే రక్తపోటు పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఛాతీ నొప్పి, ఊపిరి పీల్చుకోలేకపోవడం, బలహీనత లాంటి లక్షణాలు...

రక్తపోటు పెరిగితే?

తెలుసుకుందాం

కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే రక్తపోటు పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఛాతీ నొప్పి, ఊపిరి పీల్చుకోలేకపోవడం, బలహీనత లాంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రతించాలి. ఇలాంటి లక్షణాలేవీ లేనప్పుడు ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలి.

  • పాదాలు నేల మీద ఆనేలా కుర్చీలో కూర్చోవాలి.

  • ఇలాంటి భంగిమలో మన శరీరం ప్రమాదం లేదనే విషయాన్ని గ్రహిస్తుంది. దాంతో ఆందోళన తగ్గుతుంది.

  • అకస్మాత్తుగా రక్తపోటు పెరిగినప్పుడు పడుకోకూడదు. దీంతో రక్తనాళాల మీద అదనపు భారం పడుతుంది.

  • మాట్లాడకూడదు. టివి ఆపేసి, చుట్టూరా శబ్దాలేవీ లేకుండా చూసుకోవాలి. ప్రతి చిన్న శబ్దం అడ్రినలిన్‌ను ప్రేరేపిస్తుంది. కాబట్టి పరిసరాలు నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి.

  • నాలుగు సెకన్ల పాటు గాలి పీల్చుకుని, ఆరు సెకన్ల పాటు వదలాలి. వేగంగా, బలంగా శ్వాస తీసుకోవలసిన అవసరం లేదు. నెమ్మదిగా పీల్చుకుంటే సరిపోతుంది.

  • నెమ్మదిగా గాలి పీల్చుకోవడం వల్ల, పారాసిపథెటిక్‌ నాడీ వ్యవస్థ ప్రేరేపితమై, సాంత్వనను పెంచుతుంది. దాంతో రక్తపోటు అదుపులోకొస్తుంది.

ఈ వార్తలనూ చదవండి:

బంగారు గుడ్లు పెట్టే బాతును చంపితే.. కేంద్రానికి అన్నామలై వార్నింగ్

’ఫర్జీ’ వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో నకిలీ నోట్ల ముద్రణ.. నిందితుల అరెస్టు

Updated Date - Oct 27 , 2026 | 05:08 AM