హరీశ్‌కు తుమ్మిడిహట్టి భయం పట్టుకుంది!
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:55 AM
తుమ్మిడిహట్టి ఎత్తు పెంచడానికి మహారాష్ట్ర ఒప్పుకుంటుందేమోనని హరీశ్‌రావుకు భయం పట్టుకుందని ప్రభుత్వ విప్ విజయరమణారావు విమర్శించారు.
పాత లెక్కలు పట్టుకుని విమర్శలు
తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత
తాజా అంచనా 217.96 టీఎంసీలు
తాజా అధ్యయనంలో.. సుందిళ్ల వరకు గ్రావిటీ మార్గం పరిశీలన
ప్రభుత్వ విప్ విజయరమణారావు
హైదరాబాద్, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): తుమ్మిడిహట్టి ఎత్తు పెంచడానికి మహారాష్ట్ర ఒప్పుకుంటుందేమోనని హరీశ్‌రావుకు భయం పట్టుకుందని ప్రభుత్వ విప్ విజయరమణారావు విమర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చలు సఫలమై.. ఆదిలాబాద్, కరీంనగర్ సహా ఇతర జిల్లాలకు మేలు జరిగితే బీఆర్‌ఎస్ అడ్రస్ గల్లంతవుతుందన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఏర్పడిందన్నారు. అందుకే హరీశ్‌రావు అక్కసు వెళ్లగక్కుతున్నారని ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిన ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించడానికి చేస్తున్న ప్రయత్నాలు చూసి ఓర్చుకోలేకపోతున్నారన్నారు.
రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం... కూలేశ్వరం అయినా హరీశ్‌రావులో మార్పు రాలేదన్నారు. మహారాష్ట్రతో చర్చలు జరపడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి 42 రోజులే పట్టిందంటున్న ఆయన.. 2016లోనే ఒప్పందం చేసుకుని 2023 వరకు తుమ్మిడిహట్టిని ఎందుకు గాలికి వదిలేశారో చెప్పాలన్నారు. 148 మీటర్ల ఎత్తులో నిర్మాణ ఒప్పందంపై సంతకం చేసింది కేసీఆరే అన్నారు. తాజా లెక్కల ప్రకారం తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత 217.96 టీఎంసీలు ఉంటే.. అసలు నీళ్లే లేవంటూ పాత లెక్కలు పట్టుకుని ఎందుకు అడ్డుకుంటున్నారంటూ హరీశ్‌రావును నిలదీశారు.
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌లో ఎల్లంపల్లి వరకు 100 కి.మీ. గ్రావిటీ కాలువ, 16 కి.మీ. సొరంగం ప్రతిపాదించారని, తాజా అధ్యయనంలో సుందిళ్ల వరకు గ్రావిటీ మార్గాన్ని పరిశీలించారని పేర్కొన్నారు. ఈ రెండు దశల్లో లిఫ్టింగ్ ఖర్చు తగ్గించుకునేందుకు అవకాశం ఉందన్నారు. ‘‘తుమ్మిడిహట్టిపై సీఎం రేవంత్ మహారాష్ట్ర సీఎంకు లేఖ రాశారు. కేంద్ర జల్‌శక్తి మంత్రిని కలిశారు. సీడబ్ల్యుసీతో చర్చలు జరిపారు. తాజా సాంకేతిక నివేదికలు సమర్పించారు. ఇప్పుడు ఫడ్నవీ్‌సను నేరుగా కలిశారు. స్వతంత్ర అధ్యయనం, సంయుక్త కమిటీ ఏర్పాటుకు మహారాష్ట్ర సానుకూలంగా స్పందించింది. ఇది కాలయాపన ఎలా అవుతుంది?’’ అంటూ హరీశ్‌రావును ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
దేవాదాయ శాఖలో అక్రమాలపై.. విజిలెన్స్ నివేదికలు బుట్టదాఖలు
తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీతో నీళ్లు తెస్తే రాజీనామా చేస్తా
Read Latest AP News And Telangana News And International News And Telugu News