Share News

యువ క్రికెటర్ కల నెరవేర్చిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్

ABN , Publish Date - Oct 27 , 2026 | 11:23 AM

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ యువ క్రికెటర్ కలను నెరవేర్చాడు. ముంబైలో తాను ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో నెట్ బౌలర్‌గా వ్యవహరించిన ఓ ప్లేయర్‌కు భారత జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చాడు.

యువ క్రికెటర్ కల నెరవేర్చిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా యువ క్రికెటర్లకు అతడు స్ఫూర్తి. అంతర్జాతీయ క్రికెట్‌లో అతడి అద్భుతమైన రికార్డులు, నిలకడైన బ్యాటింగ్‌, మైదానంలో పోరాట పటిమ ఎంతోమందిని క్రికెట్‌ వైపు ఆకర్షించాయి. కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టినా, ప్రాక్టీస్‌ కోసం నెట్స్‌కు వచ్చినా అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తుంది. అతడిని ఒక్కసారైనా చూడాలని, అతడితో మాట్లాడాలని, ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలని యువ ఆటగాళ్లు ఆశపడుతుంటారు. తాజాగా కోహ్లీ ఓ యువ క్రికెటర్ కల నెరవేర్చాడు.


న్యూజిలాండ్‌తో నవంబర్ 4 నుంచి ప్రారంభం కానున్న ఐదు వన్డేల సిరీస్ కోసం కోహ్లీ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముంబైలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అక్కడే నెట్ బౌలర్‌గా ఉన్న ఓ యువ క్రికెటర్‌కు కోహ్లీని కలిసే అవకాశం వచ్చింది. తన అభిమాన క్రికెటర్‌ను దగ్గర నుంచి చూసిన ఆ యువ ఆటగాడి ఆనందానికి అవధులే లేవు. కోహ్లీ కోసం సమయం కేటాయించి.. భారత జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి అతడికి ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

ధోనికి ఉన్న ఆ సూపర్ పవర్ నాకూ కావాలి: ఫాఫ్ డుప్లెసిస్

వైభవ్ కాదు.. జట్టుకు ఇప్పుడు వరుణ్ చక్రవర్తి అవసరం: భారత మాజీ క్రికెటర్

Updated Date - Oct 27 , 2026 | 11:24 AM