Share News

తిలక్ వర్మలో యువరాజ్, ధోని లక్షణాలు కనిపిస్తున్నాయి: సురేశ్ రైనా

ABN , Publish Date - Oct 27 , 2026 | 09:34 AM

న్యూజిలాండ్‌తో రెండో టీ20లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్ తిలక్ వర్మపై భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ప్రశంసలు కురిపించాడు.

తిలక్ వర్మలో యువరాజ్, ధోని లక్షణాలు కనిపిస్తున్నాయి: సురేశ్ రైనా
Suresh Raina

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో రెండో టీ20లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్ తిలక్ వర్మపై భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ప్రశంసలు కురిపించాడు. తిలక్ ఆటతీరులో దిగ్గజ క్రికెటర్లు యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నాడు. అదే సమయంలో నితీశ్ కుమార్ రెడ్డి దూకుడైన బ్యాటింగ్‌ను, చాలా కాలం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్‌ను కూడా రైనా అభినందించాడు.


‘ప్రస్తుతం భారత జట్టు చాలా బాగా ఆడుతోంది. తిలక్ వర్మనే తీసుకోండి. గతంలో యువరాజ్ సింగ్, ధోని భాయ్, నేను.. ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో బ్యాటింగ్ చేసేటప్పుడు మాలో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం ఉండేది. అదే లక్షణం తిలక్‌లోనూ కనిపిస్తోంది. అతడి ఆలోచనా విధానం భిన్నంగా ఉంటుంది. అద్భుతంగా రాణిస్తున్నాడు. బౌలింగ్‌లోనూ జట్టుకు సహకరిస్తున్నాడు. మరోవైపు నితీశ్ కుమార్ రెడ్డి కూడా బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఒత్తిడిలోనూ దూకుడుగా ఆడుతూ జట్టు విజయానికి సహకరించడం మంచి పరిణామం.


కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌లో చాలా మార్పు వచ్చింది. అయితే అతడు కెప్టెన్సీ చేస్తున్న విధానం ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఈ ఫార్మాట్‌లో ఇలాంటి నాయకత్వ శైలిని చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను. అతడు తనకంటూ ఒక ప్రత్యేక వారసత్వాన్ని నిర్మించుకుంటున్నాడు. అతడికి నా శుభాకాంక్షలు’ అని రైనా వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

ధోనికి ఉన్న ఆ సూపర్ పవర్ నాకూ కావాలి: ఫాఫ్ డుప్లెసిస్

వైభవ్ కాదు.. జట్టుకు ఇప్పుడు వరుణ్ చక్రవర్తి అవసరం: భారత మాజీ క్రికెటర్

Updated Date - Oct 27 , 2026 | 09:34 AM