Share News

పంజాబ్‌ 289/6

ABN , Publish Date - Oct 27 , 2026 | 06:03 AM

ఐపీఎల్‌ స్టార్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (81)తోపాటు సలీల్‌ అరోరా (57 బ్యాటింగ్‌), రమణ్‌దీప్‌ సింగ్‌ (52) రాణించడంతో హైదరాబాద్‌తో సోమవారం ఇక్కడి జింఖానా గ్రౌండ్స్‌లో...

పంజాబ్‌ 289/6

రాణించిన ప్రభ్‌సిమ్రన్‌, సలీల్‌, రమణ్‌దీప్‌

హైదరాబాద్‌తో రంజీ

హైదరాబాద్‌: ఐపీఎల్‌ స్టార్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (81)తోపాటు సలీల్‌ అరోరా (57 బ్యాటింగ్‌), రమణ్‌దీప్‌ సింగ్‌ (52) రాణించడంతో హైదరాబాద్‌తో సోమవారం ఇక్కడి జింఖానా గ్రౌండ్స్‌లో ప్రారంభమైన రంజీట్రోఫీ పోరులో తొలిరోజును పంజాబ్‌ 289/6 స్కోరుతో ముగించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌కు రెండు ఫలప్రదమైన భాగస్వామ్యాలు నిర్మించిన ప్రభ్‌సిమ్రన్‌ శతకానికి 19 పరుగుల దూరంలో అవుటయ్యాడు. ఆపై జషన్‌ప్రీత్‌ సింగ్‌ (45) కూడా వెంటనే నిష్క్రమించడంతో ఐదు వికెట్లకు 182 పరుగుల స్కోరుతో పంజాబ్‌ ఇక్కట్లలో పడింది. ఈ తరుణంలో సలీల్‌, రమణ్‌ దీప్‌ ఆరో వికెట్‌కు 93 పరుగులు జత చేసి పరిస్థితి చక్కదిద్దారు. తొలి రోజు ఆఖరికి సలీల్‌తోపాటు ఇమన్‌జోత్‌ సింగ్‌ (5 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. రక్షణ్‌ రెండు వికెట్లు పడగొట్టగా, మిలింద్‌, అనికేత్‌, తనయ్‌ తలా ఒక్కో వికెట్‌ సాధించారు. ఇక విజయవాడలోని మూలపాడు గ్రౌండ్స్‌లో చత్తీస్‌గఢ్‌తో మొదలైన మరో మ్యాచ్‌లో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌటైంది. సీరమ్‌ రాహుల్‌ 89 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చత్తీస్‌గఢ్‌ తొలిరోజు ఆఖరికి వికెట్‌ నష్టానికి 35 రన్స్‌తో ఆడుతోంది.

ఇవి కూడా చదవండి:

ప్రమాదకర పిచ్‌పై కోహ్లీ పట్టుదల గురించి డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు!

యువ ఆల్ రౌండర్ నమన్ ధీర్‌పై అజింక్య రహానే ప్రశంసలు..

Updated Date - Oct 27 , 2026 | 06:03 AM