Share News

యువ ఆల్ రౌండర్ నమన్ ధీర్‌పై అజింక్య రహానే ప్రశంసలు..

ABN , Publish Date - Oct 26 , 2026 | 04:57 PM

న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌లో టీమిండియా యువ ఆల్‌రౌండ‌ర్ న‌మ‌న్ ధీర్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన రెండో టీ20ల్లోనూ న‌మ‌న్ బ్యాట్‌తో స‌త్తాచాటాడు.

యువ ఆల్ రౌండర్ నమన్ ధీర్‌పై అజింక్య రహానే ప్రశంసలు..
Naman Dhir

స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌లో టీమిండియా యువ ఆల్‌రౌండ‌ర్ న‌మ‌న్ ధీర్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన రెండో టీ20ల్లోనూ న‌మ‌న్ బ్యాట్‌తో స‌త్తాచాటాడు. రెండో టీ20లో కష్టాల్లో ఉన్న భారత్‌ను నమన్, తిలక్ వర్మ ఆదుకున్నారు. నమన్ 17 బంతుల్లో 31 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. ఇప్పుడు మూడో టీ20లోనూ త‌న జోరు కొన‌సాగించేందుకు సిద్ధమ‌య్యాడు.


ఈ క్రమంలో న‌మ‌న్ ధీర్‌పై భారత్ మాజీ కెప్టెన్ అజింక్య ర‌హానే ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. అతడు సరైన సమయంలో భారత్‌ను ఆదుకున్నాడని అన్నాడు. అంతేకాక ఏడో స్థానంలో టీమిండియాకు నమన్‌ రూపంలో ఒక 'వజ్రం' దొరికిందని ర‌హానే కొనియాడాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో కూడా అతను ప్రశాంతంగా, నిబ్బరంగా బ్యాటింగ్ చేస్తాడని పేర్కొన్నాడు. అతడి ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నానని, నమన్ నుంచి మళ్లీ రాణించడం చూడాలనుకుంటున్నానని రహానే పేర్కొన్నాడు.


మరోవైపు అభిషేక్ శర్మ గురించి కూడా రహానే పలు విషయాలు వెల్లడించాడు. మూడో టీ20లో ఓపెన‌ర్‌ అభిషేక్ ప్రదర్శన పైనే అందరి కళ్లు ఉన్నాయ‌ని అన్నాడు. మూడో టీ20లో భార‌త జ‌ట్టు త‌ర‌పున అభిషేక్ శ‌ర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాల‌ని కోరుకుంటున్నానని తెలిపాడు. అత‌డు మంచి ఫామ్‌లో ఉన్నాడని, కానీ ఈ సిరీస్‌లో ఇంకా అత‌డి నుంచి బెస్ట్ ఇన్నింగ్స్ రాలేదని రహానే పేర్కొన్నాడు. అభిషేక్ శర్మ ఆరంభంలోనే ప‌రుగులు సాధిస్తే టీమిండియాకు చాలా మంచిదని అజింక్యా రహానే తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

కివీస్-ఎతో మ్యాచ్: 199 పరుగుల వద్ద ఔట్‌.. అంపైర్‌ నిర్ణయంపై పడిక్కల్‌ అసహనం!

కివీస్‌తో మూడో టీ20కి ఇషాన్ కిషన్ దూరం.. వైభవ్‌కు మరో ఛాన్స్ దక్కుతుందా?

మ్యాచ్‌కు ముందురోజు రాత్రి జ్వరం.. పెయిన్‌కిల్లర్స్ వేసుకుని బరిలోకి: హర్మన్‌ప్రీత్

Updated Date - Oct 26 , 2026 | 05:10 PM