Share News

పాక్ గడ్డపై డకెట్ అరుదైన రికార్డు.. తొలి ఇంగ్లాండ్ బ్యాటర్..!

ABN , Publish Date - Oct 26 , 2026 | 03:58 PM

వ‌న్డే మ‌క్కోణ‌పు సిరీస్‌లో భాగంగా లాహోర్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో వికెట్ తేడాతో ఇంగ్లాండ్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ ఇంగ్లీష్ బ్యాటర్ బెన్ డకెట్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

పాక్ గడ్డపై డకెట్ అరుదైన రికార్డు.. తొలి ఇంగ్లాండ్ బ్యాటర్..!
Ben Duckett ODI Record

స్పోర్ట్స్ డెస్క్: వ‌న్డే మ‌క్కోణ‌పు సిరీస్‌లో భాగంగా లాహోర్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో వికెట్ తేడాతో ఇంగ్లాండ్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ ఇంగ్లీష్ బ్యాటర్ బెన్ డకెట్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్థాన్ గడ్డపై రెండు సెంచరీలు చేసిన తొలి ఇంగ్లాండ్ బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించాడు.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ జట్టుకు పాక్ పేస‌ర్లు ఆరంభంలోనే భారీ షాకిచ్చారు. పాక్ బౌలర్ల దెబ్బకు ఇంగ్లీష్ జ‌ట్టు కేవ‌లం 52 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఈ క్రమంలోనే క్రీజులోకి వచ్చిన బెన్ డకెట్ బాధ్యతాయుతంగా ఆడాడు. అద్భుత సెంచ‌రీ చేసి.. జ‌ట్టును ఆదుకున్నాడు. డ‌కెట్ కేవ‌లం 111 బంతుల్లో 105 పరుగులు (10 ఫోర్లు, 2 సిక్సర్లు, స్ట్రైక్ రేట్: 94.59) ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఇంగ్లాండ్ జట్టు 46.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని కాపాడుకునేందుకు ఇంగ్లాండ్ బౌల‌ర్లు ఆఖ‌రి వ‌ర‌కు పోరాడిన‌ప్ప‌టికి.. పాక్ ఆల్‌రౌండ‌ర్ షాదాబ్ ఖాన్ అద్భుత సెంచ‌రీతో ప‌ర్యాట‌క జ‌ట్టు నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.


అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ప‌రాజ‌యం పాలైన‌ప్ప‌టికి బెన్ డ‌కెట్ చేసిన వీరోచిత శ‌త‌కం అందరినీ ఆకట్టుకుంది. పాకిస్థాన్ గడ్డపై డకెట్‌కు ఇది రెండో వన్డే సెంచరీ. డకెట్ తన తొలి వన్డే శతకాన్ని 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాపై ఇదే గడాఫీ స్టేడియంలో సాధించాడు.


పాక్ గడ్డపై అత్యధిక వ‌న్డే సెంచరీలు సాధించిన బ్యాటర్లు

  • 2 - బెన్ డకెట్ (ఇంగ్లాండ్)*

  • 2 - కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)

  • 2 - అరవింద డి సిల్వా (శ్రీలంక)


ఇవి కూడా చదవండి:

కివీస్-ఎతో మ్యాచ్: 199 పరుగుల వద్ద ఔట్‌.. అంపైర్‌ నిర్ణయంపై పడిక్కల్‌ అసహనం!

కివీస్‌తో మూడో టీ20కి ఇషాన్ కిషన్ దూరం.. వైభవ్‌కు మరో ఛాన్స్ దక్కుతుందా?

మ్యాచ్‌కు ముందురోజు రాత్రి జ్వరం.. పెయిన్‌కిల్లర్స్ వేసుకుని బరిలోకి: హర్మన్‌ప్రీత్

Updated Date - Oct 26 , 2026 | 04:01 PM