టైగర్ ష్రాఫ్‌పై దాడి కేసు.. వెలుగులోకి కీలక విషయాలు
ABN , Publish Date - Oct 26 , 2026 | 03:40 PM
టైగర్ ష్రాఫ్‌పై దాడి కేసులో తాజాగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన 11వ నిందితుడు ప్రాంజల్ ఠాక్రాల్ మార్చ్ నెలలోనే మరో కేసులో బెయిల్‌పై విడుదలయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: టైగర్ ష్రాఫ్‌పై దాడి కేసులో తాజాగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన 11వ నిందితుడు ప్రాంజల్ ఠాక్రాల్ మార్చ్ నెలలోనే మరో కేసులో బెయిల్‌పై విడుదలయ్యాడు. బయటకు వచ్చిన వెంటనే టైగర్ ష్రాఫ్‌ను టార్గెట్ చేసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలిసింది.
టైగర్ ష్రాఫ్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనిల్ పండిట్ యూఎస్ నుంచే బిష్ణోయ్ గ్యాంగ్ తరఫున తన కార్యకలాపాలు సాగిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నటుడిపై దాడికి కుట్ర పన్నింది అనిల్ పండిట్ కాగా ప్లాన్‌కు కార్యరూపం ఇచ్చే బాధ్యతను ప్రాంజల్ ఠాక్రాల్ తీసుకున్నాడు. షూటర్లకు నిధులు సమకూర్చడం, ఇతరత్రా సహాయాలు చేసింది ఠాక్రాల్ అని దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో పాల్గొన్న షూటర్‌కు ఠాక్రాల్ రెండో పిస్టల్ సమకూర్చాడు.
ఎవరీ ఠాక్రాల్..
22 ఏళ్ల ఠాక్రాల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేశాడు. పానిపట్‌లోని ఓ వ్యాపారిపై దాడి కేసులో జైలుపాలైన ఠాక్రాల్ ఈ మార్చ్‌లో బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తరువాత అనిల్ పండిట్‌తో కలిసి కుట్రకు తెరితీశాడు. పానిపట్ వ్యాపారిపై దాడి వెనుక కూడా పండిట్ ఉన్నట్టు అప్పట్లో వెలుగులోకి వచ్చింది. ఇక తాజా కేసులో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు పండిట్, ఠాక్రాల్ ఓ సీక్రెట్ యాప్ ద్వారా చర్చించుకునే వారని కూడా పోలీసులు గుర్తించారు.
శుక్రవారమే పోలీసులు ఠాక్రాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం కోర్టు అతడికి అక్టోబర్ 31 వరకూ పోలీసు కస్టడీ విధించింది. అక్టోబర్ 18న ముంబైలోని జుహూ ప్రాంతంలో నిందితులు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. నేపాల్‌కు పారిపోయే ప్రయత్నంలో ఉన్న ముగ్గురు షూటర్లను పోలీసులు రాజస్థాన్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత మరికొందరిని అరెస్టు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
బిల్ గేట్స్ హెచ్చరిక.. మరో 20 ఏళ్లల్లో..
భారత్‌కు ముప్పు ఉంది: మైక్రోసాఫ్ట్ ఏఐ నిపుణుడు నికొలస్ బట్స్
ఈ వార్తలనూ చదవండి:
మీ బాధను అర్థం చేసుకుంటా.. ఢిల్లీ వ్యాపారులకు రాహుల్ హామీ
హోటల్ గదిలో నవవధువు మృతి.. వైరల్ అవుతోన్న వీడియో