Share News

మీ బాధను అర్థం చేసుకుంటా.. ఢిల్లీ వ్యాపారులకు రాహుల్ హామీ

ABN , Publish Date - Oct 26 , 2026 | 01:53 PM

ఢిల్లీలో ప్రతి వ్యాపారికీ అండగా ఉంటానని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. ఢిల్లీ వ్యాపారుల బాధను అర్థం చేసుకుంటున్నామని ఎక్స్‌లో ఆయన హామీ ఇచ్చారు.

మీ బాధను అర్థం చేసుకుంటా.. ఢిల్లీ వ్యాపారులకు రాహుల్ హామీ

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో ప్రతి వ్యాపారికీ అండగా ఉంటానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. ఢిల్లీ వ్యాపారుల బాధను అర్థం చేసుకుంటున్నామని ఎక్స్‌లో ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మెట్రో సేవలను నిలిపివేసి, రహదారులను మూసివేసి, దేశ రాజధాని ఢిల్లీని దిగ్బంధం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఓటు చోరీ జరిగితే ఏదీ సురక్షితం కాదన్నారు. ‘మీ (వ్యాపారులు) దుకాణం, మీ పొదుపు, మీ పిల్లల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడతాయి. ఓటుచోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆయనను తొలగిస్తే 30 సెకన్లలోనే ఆందోళనలు ఆగిపోతాయి’ అని రాహుల్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఐదేళ్ల గరిష్ఠ స్థాయిలో నోట్ల చలామణి

అప్రమత్తత బెటర్‌..!

Updated Date - Oct 26 , 2026 | 01:55 PM