అప్రమత్తత బెటర్..!
ABN , Publish Date - Oct 26 , 2026 | 04:16 AM
arkets may remain volatile amid global tensions and rising crude oil prices. Explore five stock recommendations with entry levels, target prices and stop-loss levels.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతుండటం, క్రూడాయిల్ ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో మదుపరులు ఈ వారం అప్రమత్తంగా వ్యవహరించటం మంచిది. వ్యూహం లేకుండా షేర్లలో పెట్టుబడులు పెట్టకూడదు. ఎందుకంటే ఈ వారం కూడా మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. గత వారం నిఫ్టీ ఏకంగా 2.4 శాతం మేర అంటే 546 పాయింట్లు పతనమైంది. ఐటీ, బ్యాంక్, ఫైనాన్స్, హౌసింగ్, ఆటోమొబైల్ సహా అన్ని రంగాలు భారీగా పతనమయ్యాయి.
స్టాక్ రికమండేషన్స్
ప్రెసిషన్ వైర్స్ ఇండియా: సుదీర్ఘకాలంగా ఈ కౌంటర్ బుల్‌రన్ కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి అక్టోబరు మొదటి వారానికి ఏకంగా 145 శాతం రాబడిని అందించింది. జీవితకాల గరిష్ఠ స్థాయిని తాకిన తర్వాత 27 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. మెరుగైన ఫండమెంటల్స్, టెక్నికల్స్, 200 రోజుల మూవింగ్ యావరేజీ వద్ద మద్దతు తీసుకోవటం సానుకూల అంశాలు. గత శుక్రవారం రూ.401 వద్ద క్లోజైన ఈ కౌంటర్లో మదుపరులు రూ.380 పై స్థాయిలో ప్రవేశించి రూ.525 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.350 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ: ఐపీఓ ఆరంభం నుంచి ఈ షేరు అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు నాటికి 340 శాతం రాబడిని అందించింది. జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత దాదాపు 33 శాతం మేర దిద్దుబాటు నమోదైంది. రిలేటివ్ స్ట్రెంత్ పర్వాలేదు. గత శుక్రవారం రూ.334 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.320 ఎగువన ఎంటరై రూ.410 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.300 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
స్టెరిలైట్ టెక్నాజీస్: కొన్ని నెలలుగా ఈ షేరు బుల్‌రన్‌ను కొనసాగిస్తోంది. చక్కని అప్‌ట్రెండ్‌తో అదరగొడుతోంది. జీవితకాల గరిష్ఠం తర్వాత ఆరోగ్యకరమైన రీతిలో 25 శాతం మేర దిద్దుబాటుకు లోనైన ఈ షేరు తాజా ఆర్థిక ఫలితాల తర్వాత మళ్లీ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.826 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.800 ఎగువన ఎంటరై రూ.1,050 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.760 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
చెన్నై పెట్రోలియం కార్పొరేషన్: స్వల్పకాల ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ షేరు ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు 88 శాతం మేర పెరిగింది. రిలేటివ్ స్ట్రెంత్ మెరుగ్గా ఉండటం, డివిడెండ్ పేమెంట్ తేదీ సమీపించటంతో ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగింది. గత శుక్రవారం రూ.1,475 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.1,400 పై స్థాయిలో ప్రవేశించి రూ.1,650 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,360 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
మార్పెన్ లాబ్స్: కొన్ని నెలలుగా బుల్‌రన్‌ను కొనసాగిస్తున్న ఈ షేరు బ్రేకౌట్ తర్వాత గరిష్ఠానికి చేరింది. ఆ తర్వాత 25 శాతం మేర పుల్‌బ్యాక్‌కు లోనైంది. అయితే రిలేటివ్ స్ట్రెంత్ బలంగా ఉండటం, తక్కువ వాల్యూమ్ నమోదవుతుండటం సానుకూల అంశాలు. గత శుక్రవారం రూ.123 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు రూ.120 ఎగువన పొజిషన్ తీసుకుని రూ.144/160 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.113 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
మీ-సేవలోడ్రైవింగ్ లైసెన్సు వీడియో!
Read Latest AP News And Telangana News And International News And Telugu News