Share News

పరువునష్టం కేసులో రాహుల్ నిర్దోషి.. సుల్తాన్‌పూర్ కోర్టు తీర్పు

ABN , Publish Date - Oct 26 , 2026 | 12:30 PM

పరువునష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి భారీ ఊరట కలిగింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెంగళూరులో నిర్వహించిన ఒక ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ సుల్తాన్‌పూర్‌‌కు చెందిన స్థానిక బీజేపీ నేత విజయ్ మిశ్రా.. రాహుల్‌పై పరువునష్టం కేసు వేశారు.

పరువునష్టం కేసులో రాహుల్ నిర్దోషి.. సుల్తాన్‌పూర్ కోర్టు తీర్పు

ఇంటర్నెట్ డెస్క్: పరువునష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ సుల్తాన్‌పూర్‌‌కు చెందిన స్థానిక బీజేపీ నేత విజయ్ మిశ్రా.. రాహుల్‌పై పరువునష్టం కేసు వేశారు. ఆ కేసు విచారణ సోమవారం సుల్తాన్‌పూర్ ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో జరిగింది. రాహుల్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శుభం వర్మ తీర్పు వెలువరించారు.


అలాగే, అదే ఏడాది బెంగళూరులో ఒక మీడియా సమావేశంలోనూ అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని మిశ్రా ఆరోపించారు. హత్య కేసులో ఉన్న వ్యక్తిగా అమిత్ షాను రాహుల్ అభివర్ణించారని ఆయన పేర్కొన్నారు. కాగా.. తనపై వేసిన పరువునష్టం దావాను రాహుల్ సవాలు చేశారు. అసందర్భోచితంగా అమిత్ షాపై తాను ఆ వ్యాఖ్యలు చేశానని రాహుల్ అన్నారు. ఆయన అసందర్భోచితంగా ఆ వ్యాఖ్యలు చేసినా.. అవి అమిత్ షా పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని మిశ్రా వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. రాహుల్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. కాగా.. ఆ ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ.. ‘బీజేపీ అధ్యక్షుడు ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆ విషయాన్ని భారత ప్రజలు మర్చిపోయారు. అది నిజం. నిజాయితీ, హుందాతనం గురించి మాట్లాడే పార్టీకి ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నారు’ అని రాహుల్ వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

గచ్చిబౌలిలో 3.5 ఎకరాల్లో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు

నా చిన్నతనంలో అన్యాయాలను చూడలేకే నక్సలైట్ అయ్యా: మంత్రి సీతక్క

ఆ పరీక్షను వాయిదా వేయాలి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ

Updated Date - Oct 26 , 2026 | 12:45 PM