Share News

జమ్ముూలో అగ్నిప్రమాదం.. 15 దుకాణాల దగ్ధం

ABN , Publish Date - Oct 26 , 2026 | 07:03 AM

జమ్మూ నగరంలో జమ్ము రైల్వే స్టేషన్ సమీపంలోని శివ మార్కెట్‌లో ఆదివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ప్రమాద స్థాయి తీవ్రంగా ఉండడంతో మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. దీంతో కొన్ని నిమిషాల వ్యవధిలోనే దుకాణాలు కాలిపోయాయి.

జమ్ముూలో అగ్నిప్రమాదం.. 15 దుకాణాల దగ్ధం

ఇంటర్నెట్ డెస్క్: జమ్ముూ నగరంలో జమ్ము రైల్వే స్టేషన్ సమీపంలోని శివ మార్కెట్‌లో ఆదివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ప్రమాద స్థాయి తీవ్రంగా ఉండడంతో మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. దీంతో కొన్ని నిమిషాల వ్యవధిలోనే దుకాణాలు కాలిపోయాయి. దీంతో వందల మంది దుకాణదారులు తమ జీవనాధారాన్ని కోల్పోయారు. ప్రమాదం జరిగిన తర్వాత మార్కెట్ ప్రాంతం నుంచి నల్లని దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. ఇరుకైన ఆ వాణిజ్యం ప్రాంతం ద్వారా కొన్ని కిలోమీటర్ల వరకు ఆ పొగలు వ్యాపించాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న ఫైర్, ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.


ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. అయితే, షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోయినా.. 15 దుకాణాలు కాలిపోవడంతో నష్టం కోట్లలో ఉంటుందని భావిస్తున్నారు. ఉన్నట్టుండి మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని అధికారులు వెల్లడించారు. దుకాణదారులు హాహాకారాలు చేస్తూ చేతికి అందిన వస్తువును తీసుకున్నారని చెప్పారు. కాగా.. జమ్ము రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శివ మార్కెట్‌లో కొన్ని వందల దుకాణాలు, లాడ్జీలు ఉన్నాయి. సీనియర్ పోలీస్, సివిల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫైర్ సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.


ఈ వార్తలనూ చదవండి:

రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని ఉపేక్షించొద్దు: మంత్రి జైశంకర్

కర్ణాటకలో కన్నడిగులకే ప్రాధాన్యం.. ఐటీ సంస్థలకు డీకే శివకుమార్ హెచ్చరిక

Updated Date - Oct 26 , 2026 | 07:51 AM